ఇటలీ లో ప్రభాస్ విల్లా ఖరీదు ఎంతో తెలుసా..?

ఈశ్వర్ సినిమా( Iswar movie ) తో ఇండస్ట్రీ కి ఎంట్రీ ఇచ్చిన ప్రభాస్ ఇప్పుడు పన్ ఇండియా స్టార్ హీరో అయ్యారు…ప్రభాస్ క్రేజ్ గురించి ఎంత చెప్పినా తక్కువేననే సంగతి తెలిసిందే… ప్రభాస్( Prabhas ) సినిమాలు నెగిటివ్ టాక్ తో కూడా కళ్లు చెదిరే స్థాయిలో కలెక్షన్లను సాధిస్తూ నిర్మాతలకు మంచి లాభాలను అందిస్తుండటం గమనార్హం.ప్రభాస్ ప్రస్తుతం షూటింగ్ లకు గ్యాప్ ఇచ్చి విదేశాల్లో ఉన్నారనే సంగతి తెలిసిందే.

 Do You Know The Cost Of Prabhas' Villa In Italy , Prabhas, Italy , Iswar Movie,-TeluguStop.com

ఇటలీలో ప్రభాస్ ఒక విల్లాను రెంట్ కు తీసుకొని ఉన్నారని సమాచారం.ఈ విల్లా రెంట్ ఏకంగా 60 లక్షల రూపాయలు అని తెలుస్తోంది.

నెలరోజులకు ఈ మొత్తం చెల్లించాలని సమాచారం.

 Do You Know The Cost Of Prabhas' Villa In Italy , Prabhas, Italy , Iswar Movie,-TeluguStop.com

ఒక్కో సినిమాకు 100 కోట్ల రూపాయల రెమ్యునరేషన్ తీసుకునే ప్రభాస్ కు ఈ మొత్తం ఎక్కువ మొత్తం కాదని కొంతమంది కామెంట్లు చేస్తుండగా ఆ మొత్తానికి తెలుగు రాష్ట్రాల్లోని కొన్ని ప్రాంతాల్లో లగ్జరీ ఇల్లు( A luxury home ) వస్తుందని మరి కొందరు కామెంట్లు చేస్తుండటం గమనార్హం.

ప్రభాస్ సినిమా సినిమాకు క్రేజ్ ను పెంచుకుంటుండగా ప్రభాస్ సినిమాలకు పాజిటివ్ టాక్ వస్తే మాత్రం రికార్డులు బ్రేక్ అవ్వాల్సిందేనని చెప్పవచ్చు.

Telugu Luxury, Adipurush, Costprabhas, Iswar, Italy, Prabhas, Tollywood-Movie

ప్రభాస్ సలార్ సినిమాతో బాక్సాఫీస్ ను షేక్ చేయడంతో పాటు అభిమానులు కోరుకున్న భారీ విజయాన్ని అందుకుంటాడని ఫ్యాన్స్ భావిస్తున్నారు.ప్రభాస్ ఇటలీ నుంచి ఇండియాకు ఎప్పుడు తిరిగొస్తారో చూడాల్సి ఉంది.ఆదిపురుష్( Adipurush ) రిలీజ్ తర్వాత ఎన్నో వివాదాలు, విమర్శలను ఎదుర్కొన్న సంగతి తెలిసిందే.

కొన్ని ప్రముఖ థియేటర్లలో మినహా, మిగతా థియేటర్లలో ఈ సినిమా బుకింగ్స్ ఏ మాత్రం ఆశాజనకంగా లేవు.ఆదిపురుష్ సోమవారం కలెక్షన్లలో భారీ డ్రాప్ కనిపించింది.

Telugu Luxury, Adipurush, Costprabhas, Iswar, Italy, Prabhas, Tollywood-Movie

ప్రభాస్ కథ, కథనం విషయంలో మరింత జాగ్రత్తగా వ్యవహరించాల్సి ఉంది.వరుస విజయాలు దక్కేలా ప్రభాస్ జాగ్రత్త పడాల్సి ఉంది.ప్రభాస్ కు ఈ మధ్య కాలంలో వరుస విజయాలు దక్కకపోయినా రాబోయే రోజుల్లో మాత్రం వరుస విజయాలు దక్కడం గ్యారంటీ అని ఇందుకు సంబంధించి సందేహాలు అవసరం లేదని నెటిజన్ల నుంచి కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.అయితే ప్రభాస్ నెక్స్ట్ చేసే సినిమాలు మాత్రం సూపర్ గా ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube