తెలంగాణ సీఎల్పీ నేత భట్టి విక్రమార్క తో మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి భేటీ అయ్యారు.నకిరేకల్ నియోజకవర్గం కేతేపల్లి వద్ద సమావేశం భట్టితో సమావేశం అయ్యారు.
అయితే వడదెబ్బ కారణంగా భట్టి విక్కమార్క నకిరేకల్ వద్ద తన పాదయాత్రకు బ్రేక్ ఇచ్చారు.ఈ నేపథ్యంలో పొంగులేటి కాంగ్రెస్ లో చేరికపై క్లారిటీ వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది.
అయితే ఇప్పటికే టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి పొంగులేటిని పార్టీలోకి ఆహ్వానించిన సంగతి తెలిసిందే.







