రాజన్న సిరిసిల్ల జిల్లా: తెలంగాణ దశాబ్ది ఉత్సవాలను పునస్కరించుకొని జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో సిరిసిల్ల పట్టణంలోని నేతన్న చౌక్ వద్ద మాధకద్రవ్యాలు,గంజాయి వంటి మత్తు పదార్థాల మీద అవగాహన కల్పిస్తూ ఫ్లాష్ మాబ్ కార్యక్రమం నిర్వహించారు.తెలంగాణ గిరిజన సంక్షేమ రెసిడెన్షియల్ డిగ్రీ, ఫైన్ ఆర్ట్స్ కళాశాల తంగళ్లపల్లి కి చెందిన విద్యార్థులు నృత్య ప్రదర్శనలు,మాధకద్రవ్యాల నిర్ములనకు తీసుకుంటున్న ప్రత్యేక చర్యలను తెలియజేస్తూ రూపొందించిన ప్లాకార్డ్స్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచి అందరిని ఆకట్టుకున్నాయి.
ఈ ఫ్లాష్ మాబ్ కార్యక్రమంలో ఏర్పాటు చేసిన ప్లాకార్డ్స్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచి పలువురిని ఆకట్టుకోవడంతో పాటు ఆలోచింప చేసే విధంగా ఉన్నాయి.ఈ సందర్భంగా ఎస్పి మాట్లాడుతూ…యువత మాధకద్రవ్యాలు,గంజాయి వంటి మత్తు పదార్ధాలకు దూరంగా ఉండాలని,మత్తు పదార్థాలకు అలవాటు పడి జీవితాన్ని నాశనం చేసుకోవద్దు అన్నారు.
యువత మత్తు పదార్థాలకు అలవాటు కాకుండా తల్లిదండ్రులు ఎప్పటికప్పుడు పిల్లల ప్రవర్తనపై దృష్టి సారించాలని,మత్తు పదార్థాలకు అలవాటు పడి మనేయలేని స్థితిలో ఉన్న వారిని తమ వద్దకి తీసుకువస్తే మానసిక నిపుణులతో అవగాహన కల్పిస్తామన్నారు.ప్రతి పోలీస్ స్టేషన్ పరిధిలో,కలశాలలో గంజాయ,మత్తు పధార్థాలకు అలవాటు పడకుండా అవగాహన కార్యక్రమాలు నిరహిస్తున్నామని అన్నారు.
గంజాయి మత్తులో ఎంతో మంది యువత వారికి తెలియకుండానే నేరాలకు పాల్పడి జైలుజీవితం గడుపుతున్నారు.గంజాయి,మత్తు పదార్థాలకు అలవాటు పడి యువత బంగారు భవిష్యత్తు నాశనం చేసుకోవద్దన్నారు.
గంజాయి, మరే ఇతర మత్తు పదార్థాలు అమ్ముతున్నట్లు రవాణా చేస్తున్నట్లు సమాచారం ఉంటే వెంటనే పోలీస్ స్టేషన్ కి లేదా డయల్100 కు సమాచారం అందించాలని, సమాచారం అందించిన వారి పేర్లను గోప్యంగా ఉంచుతామని ఎస్పీ తెలిపారు.ఫ్లాష్ మాబ్ కార్యక్రమంలో పాల్గొన్న తెలంగాణ గిరిజన సంక్షేమ రెసిడెన్షియల్ డిగ్రీ మరియు ఫైన్ ఆర్ట్స్ కళాశాల విద్యార్థులను,ప్రిన్సిపాల్, ఉపాధ్యాయునిలను ప్రత్యేకంగా అభినందించారు.
ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ చంద్రయ్య, సి.ఐ లు అనిల్ కుమార్,ఉపేందర్, ఎస్.ఐ లక్ష్మారెడ్డి,ప్రిన్సిపాల్ రజిని,కళాశాల ఉపాధ్యాయునిలు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.