కొత్తగా చీపురు కొన్నారా.. దానికి తాళం వేస్తే అద్భుతమైన ప్రయోజనం!

సాధారణంగా చీపురు( Broomstick ) కొనుగోలు చేసినప్పుడు దాని నుంచి గడ్డి పొడి ఎక్కువగా రాలుతుంటుంది.అలాంటప్పుడు మహిళలు దానిని బయట దులిపేస్తుంటారు.

 Know The Benefits Of Locking New Broom To Avoid Dust Allergy Details, Broomstick-TeluguStop.com

మరి కొందరు అలానే వాడేస్తుంటారు.దీనివల్ల ఇంటిలో అనవసరంగా చీపురు దుమ్ము పడే అవకాశం ఉంది.

ఇలా జరగకుండా ఉండటానికి ఒక సింపుల్ ట్రిప్ ఫాలో అవ్వొచ్చు.అదేంటంటే చీపురు కొనుగోలు చేసిన వెంటనే దానికి లాక్( Lock ) వేయాలి.

చీపురులో దిగువ భాగాన ఉండే ఊడ్చే భాగానికి ఒక తాళం వేయాలి.తర్వాత ఊడ్చే భాగాన్ని ఒక కాటన్ బ్యాగ్ లేదా కవర్‌తో చుట్టేయాలి.

అనంతరం ఆ తాళాన్ని నేలపై మెల్లిగా కొట్టాలి.అప్పుడు చీపురికి ఉన్న దుమ్ము ( Dust ) అంతా కూడా ఆ కవర్‌లో పడిపోతుంది.

Telugu Broom Dust, Broomstick, Broomstick Dust, Dust Allergy, Stick, Broom-Lates

తాళం వేయకుండా కూడా చీపురు దుమ్మును వదలగొట్టొచ్చు.అందుకు ఊడ్చే భాగాన్ని ఒక కాటన్ బ్యాగ్‌లో ఉంచాలి.ఆపై తాళంతో ఆ భాగాన్ని మృదువుగా తట్టాలి.అలా చేశాక తాళాన్ని చీపురుపై రుద్దాలి.అప్పుడు కూడా చీపురు దుమ్ము వదులుతుంది.చీపురు కొనుగోలు చేసినప్పుడు మాత్రమే కాకుండా దానికి దుమ్ము పట్టినప్పుడల్లా ఈ ట్రిక్ ఫాలో అవ్వచ్చు.

ఈ ట్రిక్ కి సంబంధించిన వీడియోలు కూడా యూట్యూబ్‌లో అందుబాటులో ఉంటాయి.

Telugu Broom Dust, Broomstick, Broomstick Dust, Dust Allergy, Stick, Broom-Lates

చీపురు నుంచి వదిలించిన దుమ్ము అనేది కాటన్ బ్యాగ్ లో మాత్రమే పడుతుంది.చాలామందికి డస్ట్ ఎలర్జీ ఉంటుంది.ఇలాంటివారు చీపురు దుమ్ము వల్ల కూడా ఇబ్బంది పడే అవకాశం ఉంది.

ఆ ఇబ్బందులు తలెత్తకుండా ఈ జాగ్రత్తలు తీసుకోవడం చాలా అవసరం.ఇంకా ఇంట్లో ఉన్న డస్ట్ మొత్తం పోయేందుకు ఊడ్చే భాగానికి జిగురు ఉన్న స్టిక్కర్ అతికించాలి.

దానితో ఊడవడం ద్వారా పెంపుడు జంతువుల వెంట్రుకల నుంచి మిగతా సూక్ష్మమైన దుమ్ము అంతా కూడా ఈజీగా వదులుతుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube