కొత్తగా చీపురు కొన్నారా.. దానికి తాళం వేస్తే అద్భుతమైన ప్రయోజనం!

సాధారణంగా చీపురు( Broomstick ) కొనుగోలు చేసినప్పుడు దాని నుంచి గడ్డి పొడి ఎక్కువగా రాలుతుంటుంది.

అలాంటప్పుడు మహిళలు దానిని బయట దులిపేస్తుంటారు.మరి కొందరు అలానే వాడేస్తుంటారు.

దీనివల్ల ఇంటిలో అనవసరంగా చీపురు దుమ్ము పడే అవకాశం ఉంది.ఇలా జరగకుండా ఉండటానికి ఒక సింపుల్ ట్రిప్ ఫాలో అవ్వొచ్చు.

అదేంటంటే చీపురు కొనుగోలు చేసిన వెంటనే దానికి లాక్( Lock ) వేయాలి.

చీపురులో దిగువ భాగాన ఉండే ఊడ్చే భాగానికి ఒక తాళం వేయాలి.తర్వాత ఊడ్చే భాగాన్ని ఒక కాటన్ బ్యాగ్ లేదా కవర్‌తో చుట్టేయాలి.

అనంతరం ఆ తాళాన్ని నేలపై మెల్లిగా కొట్టాలి.అప్పుడు చీపురికి ఉన్న దుమ్ము ( Dust ) అంతా కూడా ఆ కవర్‌లో పడిపోతుంది.

"""/" / తాళం వేయకుండా కూడా చీపురు దుమ్మును వదలగొట్టొచ్చు.అందుకు ఊడ్చే భాగాన్ని ఒక కాటన్ బ్యాగ్‌లో ఉంచాలి.

ఆపై తాళంతో ఆ భాగాన్ని మృదువుగా తట్టాలి.అలా చేశాక తాళాన్ని చీపురుపై రుద్దాలి.

అప్పుడు కూడా చీపురు దుమ్ము వదులుతుంది.చీపురు కొనుగోలు చేసినప్పుడు మాత్రమే కాకుండా దానికి దుమ్ము పట్టినప్పుడల్లా ఈ ట్రిక్ ఫాలో అవ్వచ్చు.

ఈ ట్రిక్ కి సంబంధించిన వీడియోలు కూడా యూట్యూబ్‌లో అందుబాటులో ఉంటాయి. """/" / చీపురు నుంచి వదిలించిన దుమ్ము అనేది కాటన్ బ్యాగ్ లో మాత్రమే పడుతుంది.

చాలామందికి డస్ట్ ఎలర్జీ ఉంటుంది.ఇలాంటివారు చీపురు దుమ్ము వల్ల కూడా ఇబ్బంది పడే అవకాశం ఉంది.

ఆ ఇబ్బందులు తలెత్తకుండా ఈ జాగ్రత్తలు తీసుకోవడం చాలా అవసరం.ఇంకా ఇంట్లో ఉన్న డస్ట్ మొత్తం పోయేందుకు ఊడ్చే భాగానికి జిగురు ఉన్న స్టిక్కర్ అతికించాలి.

దానితో ఊడవడం ద్వారా పెంపుడు జంతువుల వెంట్రుకల నుంచి మిగతా సూక్ష్మమైన దుమ్ము అంతా కూడా ఈజీగా వదులుతుంది.

జీరా వాట‌ర్ బ‌రువు త‌గ్గ‌డానికి మాత్రమే కాదు.. ఆ స‌మ‌స్య‌ల‌కు కూడా చెక్ పెడుతుంది తెలుసా?