ఆ బ్యానర్ ను నమ్మి మూడుసార్లు మోసపోయిన ప్రభాస్.. ఇప్పటికైనా జాగ్రత్త పడతారా?

టాలీవుడ్ స్టార్ హీరోలలో ఒకరైన ప్రభాస్( Young Rebel Star Prabhas ) గత మూడు సినిమాలు ఆశించిన ఫలితాలను సొంతం చేసుకోలేదనే సంగతి తెలిసిందే.బాహుబలి, బాహుబలి2 సినిమాలతో ఘన విజయాలను సొంతం చేసుకున్న ప్రభాస్ సాహో, రాధేశ్యామ్, ఆదిపురుష్ సినిమాలతో భారీ నష్టాలను ఖాతాలో వేసుకున్నారు.

 T Series Banner Is Ther Curse For Hero Prabhas Details Here Goes Viral In Soc-TeluguStop.com

ఈ మూడు సినిమాల ద్వారా వచ్చిన నష్టాల మొత్తం 250 కోట్ల రూపాయల కంటే ఎక్కువ మొత్తమని తెలుస్తోంది.

Telugu Salaar, Prabhas, Project, Tollywood-Movie

టీ సిరీస్ బ్యానర్( T-Series ) ప్రభాస్ గత మూడు సినిమాలలో జోక్యం చేసుకోవడం గమనార్హం.ప్రభాస్ భవిష్యత్తు ప్రాజెక్ట్ లలో కొన్ని ప్రాజెక్ట్ లను టీ సిరీస్ నిర్మిస్తోందని తెలుస్తోంది.అయితే ప్రభాస్ మాత్రం ఈ బ్యానర్ కు దూరంగా ఉంటే మంచిదని కొంతమంది సోషల్ మీడియా వేదికగా అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

ప్రభాస్ కెరీర్ విషయంలో జాగ్రత్త పడాల్సిన అవసరం అయితే ఉందని కొంతమంది చెబుతున్నారు.

మరోవైపు ప్రభాస్ పెరిగిన క్రేజ్, ఇమేజ్ కు అనుగుణంగా భారీ స్థాయిలో రెమ్యునరేషన్( Prabhas Remuneration ) ను తీసుకోవడంతో పాటు కథల విషయంలో మరింత శ్రద్ధగా వ్యవహరించాల్సి ఉంది.

ప్రభాస్ మారుతున్న ప్రేక్షకుల అభిరుచిని దృష్టిలో ఉంచుకుంటే కెరీర్ పరంగా బాగుంటుందని కొంతమంది అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.ప్రభాస్ వరుస విజయాలు సాధించాలని ఫ్యాన్స్ ఆకాంక్ష అనే సంగతి తెలిసిందే.

Telugu Salaar, Prabhas, Project, Tollywood-Movie

ప్రభాస్ తన సినిమాల నిర్మాతలకు నష్టాలు వస్తే మాత్రం కొంతమేర భరించడానికి సిద్ధమవుతున్నారు.తన సినిమాల నిర్మాతలను ఆదుకునే విషయంలో ప్రభాస్ ఎప్పుడూ ముందువరసలో ఉంటారు.సలార్, ప్రాజెక్ట్ కే సినిమాలు( Project K ) ప్రభాస్ అభిమానుల ఆకలిని కచ్చితంగా తీరుస్తాయని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.ఈ రెండు సినిమాల బడ్జెట్ 1000 కోట్ల రూపాయలకు అటూఇటుగా ఉండటంతో ప్రభాస్ ఈ సినిమాల విషయంలో ఎలాంటి తప్పులు జరగకుండా జాగ్రత్త పడాల్సిన అవసరం అయితే ఉంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube