ప్రభాస్( Prabhas ) హీరోగా నటించిన ఆది పురుష్ ( Adipurush ) సినిమాకు మిశ్రమ స్పందన లభిస్తుంది.ఈ సినిమా గురించి మొదటి నుంచి కాస్త నెగిటివ్ అభిప్రాయంఉంది అయితే సినిమా విడుదలైన తర్వాత సినిమా తప్పకుండా అందరికీ నచ్చుతుందని చిత్ర బృందం తెలియచేశారు కానీ సినిమా జూన్ 16వ తేదీ విడుదలైనప్పటికీ మిశ్రమ స్పందన దక్కించుకొని ముందుకు కొనసాగుతుంది.
అయితే గత రెండు రోజులుగా కలెక్షన్లు కూడా భారీగా పడిపోయాయని తెలుస్తుంది.ఇక ఈ సినిమా విడుదలైన తర్వాత ఎంతోమంది సెలబ్రిటీలు ఈ సినిమా గురించి స్పందించి వారి అభిప్రాయాలను తెలియజేశారు.

ఈ క్రమంలోనే ప్రముఖ నటుడు సుమన్ ( Suman ) సైతం ఆది పురుష్ సినిమా గురించి మాట్లాడుతూ తన అభిప్రాయాలను తెలియజేశారు.ఇక సుమన్ కూడా శ్రీరామదాసు సినిమాలో రాముడి పాత్రలో నటించిన విషయం మనకు తెలిసిందే.ఈ సందర్భంగా సుమన్ మాట్లాడుతూ… ఆది పురుష్ సినిమాను రావణుడు సీతను ఎత్తుకుపోవడం నుంచి ఆమెను రక్షించడం వరకు మాత్రమే చూపించారు.అయితే మనం చిన్నప్పటినుంచి సినిమాలలో రాముడు అంటేనే నీలిరంగులో ఉండటం చూసాము.
అలాగే గడ్డాలు మీసాలు కూడా ఉండవు కానీ ఈ సినిమాలో అవన్నీ చూపించారు.

ఈ విధంగా రాముడిని చూపించడం చాలా పెద్ద రిస్క్ అని చెప్పాలి.అయినప్పటికీ ఈ సినిమా కోసం ప్రభాస్ రెండు సంవత్సరాల పాటు తన బాడీని అలాగే మెయింటైన్ చేస్తూ వచ్చారు.అందుకు ఆయనకు హ్యాట్సాఫ్ చెప్పాలని సుమన్ తెలిపారు.
రావణుడికి మోడ్రన్ హెయిర్ కట్ చేశారు ఆయన వేషధారణ పూర్తిగా మార్చారు ఇలా చేయడం పెద్ద తప్పు.ఇక సీత పాత్రలో కృతి సనన్ చాలా బాగా నటించారని తెలిపారు.
ఇక ఈ సినిమా చూస్తున్న సమయంలో అక్కడక్కడ హాలీవుడ్ సినిమాలను గుర్తు చేసింది.ఇలా ఈ తప్పులు కనుక చేయకపోతే ఈ సినిమా ఎంతో అద్భుతంగా ఉండేదని ఈ సినిమాని చూస్తున్న సమయంలో కాస్త నిరాశ చెందాను.
ఇలాంటి సినిమాలను నార్త్ వారి కన్నా సౌత్ వాళ్లే బాగా చేయగలరు అంటూ ఈ సందర్భంగా సుమన్ చేసిన ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.







