సినీ ఇండస్ట్రీలో నటిగా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నటువంటి రకుల్ ప్రీతిసింగ్ ( Rakul Preeth Singh ) గురించి పరిచయం అవసరం లేదు అయితే ప్రస్తుతం సినిమాలకు దూరంగా ఉంటూ బాలీవుడ్ సినిమాలలో నటిస్తూ అక్కడే సెటిల్ అయ్యారు.అయితే ప్రస్తుతం ఈమె ఇండియన్2( Indian 2 ) సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నారు.
ఇలా కెరియర్ పరంగా పలు సినిమాలలో నటిస్తూ బిజీగా ఉన్నటువంటి ఈమె బాలీ వుడ్ నటుడు, నిర్మాత జాకీ భగ్నానీ అనే వ్యక్తితో ప్రేమలో ఉన్న విషయం తెలిసిందే.

ఇలా ప్రేమలో ఉన్నటువంటి ఈమె పెళ్లి గురించి వార్తలు వస్తున్నా ఇంకా ఈ జంట ప్రేమలో మునిగి తేలుతున్నారు.అయితే తాజాగా ఈమె ఒక ఇంటర్వ్యూలో పాల్గొని ప్రేమ గురించి సంచలన వ్యాఖ్యాలు చేశారు.ప్రేమకు పెద్ద శత్రువు అబ్బదం అంటూ సమాధానం చెప్పారు.
ఇద్దరి మధ్య సన్నిహిత సంబంధం దాచడం కోసం ఏదో అబ్బదం చెప్పడం పెద్ద విషయం కాదు.ప్రేమించిన వ్యక్తికి ప్రియురాలిగా మారడానికి ముందు ఇద్దరు మధ్య ఉన్న స్నేహాన్ని తాను ఎంతో గౌరవిస్తానని తెలియజేశారు.

మనం మనుషులం..మనిషి అన్న తర్వాత తప్పులు చేయడం సర్వసాధారణం.మనం తప్పు చేసిన దానిని మనసు విప్పి మాట్లాడుకోవడం ఎంతో ముఖ్యం అలా కాకుండా దాచి పెట్టడం పెద్ద తప్పు అవుతుంది.
ప్రేమలో ఉన్నవారు ఇలా అబద్ధాలు చెబుతూ, ఎమోషనల్ గా మాట్లాడుతూ మోసం చేయడానికి తాను ఏమాత్రం సహించని రకుల్ తెలిపారు.ఇక ప్రేమించిన వ్యక్తిని తాను చెప్పినదే చేయాలి అంటూ వారిపై ఎక్కువ ఒత్తిడి కూడా తీసుకువస్తున్నారు.
వారికి ఏమాత్రం స్వేచ్ఛ ఇవ్వకుండా మనకు నచ్చినది చేయాలని చెబుతున్నారు.ఇలా కాకుండా మిమ్మల్ని సంతోష పరుస్తూ ఉన్నత స్థాయిలో నిలబడటమే నిజమైన ప్రేమ అనీ నేను భావిస్తున్నాను అంటూ రకుల్ చేసిన ఈ కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.