ఆ ఘటన బాధ కలిగించింది... యాక్షన్ లోకి దిగండి ఏపీ పోలీసులకు విజ్ఞప్తి చేసిన డైరెక్టర్?

ఆంధ్రప్రదేశ్ బాపట్ల జిల్లా ఉప్పల వారి పాలెంలో పదవ తరగతి చదువుతున్నటువంటి విద్యార్థి అమర్ నాథ్ (Amarnath) కొందరు దుండగులు సజీవ దహనం చేసిన విషయం మనకు తెలిసిందే.ఈ విషయం గత కొద్దిరోజులుగా సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వైరల్ గా మారింది.

 Harish Shankar Demands Justice For Uppala Amarnath Death At Bapatla Andhra Prade-TeluguStop.com

అయితే ఈ విషయంపై ప్రతిపక్ష నాయకులు తీవ్రస్థాయిలో మండిపడుతున్నాయి.తాజాగా చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) కూడా అమర్ నాథ్ కుటుంబ సభ్యులను పరామర్శించిన విషయం మనకు తెలిసిందే.

ఇకపోతే అమర్నాథ్ పై దాడి చేసినటువంటి వారు వైఎస్ఆర్సిపి నాయకులు కావడంతో పోలీసులు కూడా ఈ విషయంలో ముందడుగు వేయలేకపోతున్నారంటూ ఓ వార్త వైరల్ గా మారింది.

ఇకపోతే బాపట్లలో జరిగిన ఈ దాడి పట్ల సినిమా సెలబ్రెటీలు ఇప్పటివరకు ఎవరు స్పందించకపోవడం గమనార్హం.దిశా ఎన్కౌంటర్లో పోలీసులపై ప్రశంశలు కురిపించిన సినీ సెలబ్రిటీలు అమర్నాథ్ విషయంలో ఎందుకు మౌనంగా ఉన్నారు అంటూ ఒక వెబ్ పోర్టల్ లో అధికారక ఖాతా ద్వారా తెలియజేయడంతో ఈ విషయంపై డైరెక్టర్ హరీష్ శంకర్(Harish Shankar) స్పందించారు.ఈ సందర్భంగా ఆయన స్పందిస్తూ కొన్ని కారణాలవల్ల ఈ వార్త నా వరకు రావడం స్కిప్ అయ్యి నా వరకు చేరలేదని తెలిపారు.

తాను ఈ ఘటనను తీవ్రంగా ఖండిస్తున్నానని నిందితులు ఎవరైనా సరే వారికి కఠినంగా శిక్ష పడాల్సిందేనని డైరెక్టర్ కోరుకున్నారు.ఈ ఘటన నన్ను చాలా బాధపెట్టిందని నిందితులు ఎవరైనా కూడా పోలీసులు వారికి కఠిన శిక్ష పడాలని ఈయన పోలీసులను ట్యాగ్ చేస్తూ చేసినటువంటి ఈ ట్వీట్ ప్రస్తుతం వైరల్ అవుతుంది.ఇక ఈ విషయంపై ఈయన ఏపీ పోలీసులకు విజ్ఞప్తి చేస్తూ దయచేసి నిందితుల పట్ల చర్యలు తీసుకోండి సర్ ఇది కీలక సమయం అంటూ ఈయన పోలీసులకు విజ్ఞప్తి చేశారు.ప్రస్తుతం ఈయన చేసినటువంటి ట్వీట్ వైరల్ అవుతుంది.

ఇక ఈయన సినిమాల విషయానికొస్తే పవన్ కళ్యాణ్ (Pawan Kalyan)హీరోగా నటిస్తున్నటువంటి ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా పనులలో బిజీగా ఉన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube