ప్రధాని నరేంద్ర మోడీ ( Prime Minister Narendra Modi )మరికొద్దిగంటల్లో అమెరికా గడ్డపై అడుగుపెట్టనున్నారు.ఆయన రాక కోసం అమెరికన్లు, ప్రవాస భారతీయులు ఎదురుచూస్తున్నారు.
అలాగే మోడీకి స్వాగతం పలికేందుకు భారీ ఏర్పాట్లు చేశారు.జూన్ 21 నుంచి 23 వరకు ప్రధాని మోడీ అధికారిక, అనధికారిక కార్యక్రమాల్లో పాల్గొననున్నారు.
భారతీయ ప్రవాసులు నిర్వహించే సాంస్కృతి కార్యక్రమాల్లో కూడా మోడీ పాల్గొంటారు.అయితే ప్రముఖ ఆఫ్రికన్ అమెరికన్ గాయని మేరీ మిల్‌బెన్ ( American singer Mary Milben )మోడీ సమక్షంలో ప్రదర్శన ఇవ్వనున్నారు.
న్యూయార్క్, వాషింగ్టన్‌లలో జరిగే కార్యక్రమాలలలో మిల్‌బెన్ షోలను నిర్వాహాకులు ఏర్పాటు చేశారు.మిల్‌బెన్ గతంలో భారత జాతీయ గీతం జనగణమన, ఓం జై జగదీష హరే పాటలను పాడి భారతీయులకు దగ్గరయ్యారు.

దీనిపై మిల్‌బెన్ స్పందిస్తూ.భారత ప్రధాని నరేంద్ర మోడీ రాక కోసం తాను ఎంతగానో ఎదురుచూస్తున్నట్లు తెలిపారు.యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీ ప్రెసిడెంట్ క్సాబా కొరోసి( President Xaba Korosi ), అంబాసిడర్ రుచిరా కాంబోజ్, న్యూయార్క్ నగర మేయర్ ఎరియ్ ఆడమ్స్‌తో కలిసి ఐక్యరాజ్యసమితిలో జరిగే కార్యక్రమానికి మోడీని స్వాగతించేందుకు ఎదురుచూస్తున్నానని మిల్‌బెన్ పేర్కొన్నారు.జూన్ 23న వాషింగ్టన్ డీసీలోని రోనాల్డ్ రీగన్ బిల్డింగ్ అండ్ ఇంటర్నేషనల్ ట్రేడ్ సెంటర్‌లో యునైటెడ్ స్టేట్స్ ఇండియన్ కమ్యూనిటీ ఫౌండేషన్ (యూఎస్‌ఐసీఎఫ్) ఆధ్వర్యంలో జరగనున్న కార్యక్రమంలోనూ మిల్‌బెన్ ప్రదర్వన ఇవ్వనున్నారు.

ఎవరీ మిల్‌బెన్ :
ఓక్లహోమా నగరంలోని క్రైస్తవ కుటుంబంలో ఆమె జన్మించారు.తల్లి అల్ధియా మిల్‌బెన్ పెంటెకోస్తల్ మ్యూజిక్ పాస్టర్‌గా పనిచేసింది.ఈ క్రమంలోనే మ్యూజిక్ మిల్‌బెన్‌ను తీవ్రంగా ప్రభావితం చేసింది.ఈ నేపథ్యంలో ఓక్లహోమా సిటీలోని వైల్డ్‌వుడ్ క్రిస్టియన్ చర్చిలో చిన్నారుల గాయక బృందంలో ఐదేళ్ల వయసులోనే పాడటం ప్రారంభించింది.
భారత ప్రభుత్వం, కేంద్ర విదేశాంగ శాఖ, ఇండియన్ కౌన్సిల్ ఫర్ కల్చరల్ రిలేషన్స్ ఆహ్వానం మేరకు మిల్‌బెన్ గతేడాది భారతదేశాన్ని సందర్శించారు.భారత్‌కు స్వాతంత్య్రం వచ్చి 75 సంవత్సరాలు గడిచిన సందర్భంగా మిల్‌బెన్ ప్రదర్శన ఇచ్చారు.
ఆమెకు తొలి నుంచి భారతదేశమన్నా, ఇక్కడి సాంప్రదాయాలన్నా ఎంతో ఇష్టం.







