కరీంనగర్ జిల్లాలో విద్యార్థి సంఘాల నాయకుల మధ్య చెలరేగిన వివాదం తీవ్ర ఉద్రిక్తతకు దారి తీసింది.కరీంనగర్ రావ్స్ టెక్నో స్కూల్ ఎదుట ఏబీవీపీ, ఎస్ఎఫ్ఐ విద్యార్థి సంఘాల నేతలు పోటాపోటీగా ఆందోళన కార్యక్రమాలు చేపట్టారు.
స్కూల్ యాజమాన్యం నిబంధనలు ఉల్లంఘిస్తోందంటూ నిరసనకు దిగారు.ఈ క్రమంలో మాట మాట పెరిగి ఇరు వర్గాలకు చెందిన నాయకులు ఘర్షణకు దిగారు.
స్థానికుల సమాచారంతో రంగంలోకి దిగిన పోలీసులు రెండు సంఘాలకు చెందిన నేతలకు సర్ది చెప్పడంతో పరిస్థితి అదుపులోకి వచ్చింది.







