రంగారెడ్డి జిల్లా మణికొండలోని ఓ కిడ్స్ ప్లే స్కూల్ లో అగ్నిప్రమాదం జరిగింది.షార్ట్ సర్క్యూట్ కారణంగా బిల్డింగ్ ఫస్ట్ ఫ్లోర్ లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయని సమాచారం.
వెంటనే అప్రమత్తమైన స్కూల్ సిబ్బంది ఫైర్ సిబ్బందికి సమాచారం అందించారు.ఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక అధికారులు మంటలను అదుపులోకి తీసుకువచ్చారు.