ఈ రోజు టాలీవుడ్ ప్రజలు లేవడం లేవడంతోనే మంచి గుడ్ న్యూస్ విన్నారు. మెగా ఫ్యామిలీ అండ్ ఫ్యాన్స్ తో పాటు సాధారణ ప్రజలు సైతం రామ్ చరణ్ దంపతులకు బిడ్డ పుడుతుందని సంతోషం వ్యక్తం చేసారు.
ఎన్నో రోజుల ఎదురు చూపులకు ఈ రోజు ఫలితం దక్కింది.ఈ రోజు రామ్ చరణ్ అండ్ ఉపాసన దంపతులకు పండండి ఆడబిడ్డ( Baby Girl ) జన్మించింది.
ఈ విషయం ఉదయాన్నే బయటకు రావడంతో మెగా ఫ్యామిలీలో( Mega Family ) సంబరాలు మిన్నంటాయి.గ్లోబల్ వైడ్ గా పేరు పొందిన రామ్ చరణ్( Ram Charan ) తన భార్య ఉపాసన ( Upasana ) త్వరలోనే తల్లిదండ్రులు కాబోతున్నట్టు గత కొద్దిరోజుల క్రితం ప్రకటించిన విషయం తెలిసిందే.
మెగాస్టార్ చిరంజీవి( Chiranjeevi ) కూడా చాలా ఆనందంగా త్వరలోనే గ్రాండ్ పేరెంట్స్ అవుతాం అని పోస్ట్ చేసి తన ఆనందాన్ని తెలిపారు.
ఇక ఆ తరుణం ఈ రోజు నిజం అయ్యింది.ఎన్నో ఆశీస్సుల మధ్య రామ్ చరణ్ బిడ్డ బయటకు వచ్చింది.ఆడపిల్లకు జన్మనిచ్చారని న్యూస్ వైరల్ అవ్వగా ఫ్యాన్స్ కూడా ఆనందం వ్యక్తం చేసారు.
ఈ క్రమంలోనే తల్లిదండ్రులు అయిన రామ్ చరణ్ అండ్ ఉపాసన దంపతులకు ఫ్యామిలీ అండ్ ప్రముఖుల నుండి శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి.జూన్ 20న అంటే ఈ రోజు వీరి బిడ్డ పుట్టింది.
మరి ఈ క్రమంలోనే తాత అయిన ఆనందంలో మెగాస్టార్ కూడా సోషల్ మీడియా వేదికగా పోస్ట్ చేయడం.ఆయన ఆనందాన్ని తెలియజేసుకోవడం మరింత ఆనందంగా మారింది.సోషల్ మీడియా వేదికగా చిరు పోస్ట్ చేస్తూ. ”వెల్కమ్ లిటిల్ మెగా ప్రిన్సెస్.నీ రాక లక్షలాది మెగా కుటుంబాన్ని ఆనందంలో ముంచెత్తింది.నీ తల్లిదండ్రులుగా రామ్ చరణ్, ఉపాసన తాతగా నన్ను చేసినందుకు ఎంతో ఆనందంగా ఉందంటూ మెగాస్టార్ పెట్టిన ఈ బ్యూటిఫుల్ పోస్ట్ నెట్టింట వైరల్ అయ్యింది.