బాపు రమణ ( Bapu Ramana )సంపూర్ణ రామాయణం సినిమా తీయాలి అనుకున్నప్పుడు ఒక పెద్ద చిక్కు వచ్చి పడింది.ఆ సినిమాలో రావణాసురిడి పాత్రలో ఎస్వీ రంగారావు గారు నటించారు.
ఇక సీతమ్మ పాత్రలో చంద్రకళ నటించింది.రంగారావు( Ranga Rao ) సెట్ లో అడుగు పెట్టగానే సీత పాత్ర లో జమున కాకుండా మరొక అమ్మాయిని చూసి ఈవిడ సీత ఏంటి.? ఈ చిత్రంలో జమున ఉంది అని చెప్పారు చంద్ర కళ చూడటానికి బక్కచిక్కి పోయి ఉంది.ఈమె కోసం పోయి పోయి నేను యుద్ధం చేస్తే జనాలు నవ్వుతారు.
నా పక్కన ఏమాత్రం ఆనదు.త్వరగా సీత గా జమున వస్తే పెట్టేయండి అన్నారట.

అయితే మొదట జమున ( Jamuna )తో కూడా ఇదే పేచీ.బాపు జమున దగ్గరికి వెళ్లి సంపూర్ణ రామాయణం తీయడానికి పూనుకున్నాను కైక పాత్రలో నటించాలి మీరు అని అడిగారట.సీత కోసం వేరే అమ్మాయిని పెళ్లి నన్ను కైక గా ఎలా అడుగుతున్నారు అని జమున కన్నెర్ర చేసిందట.కానీ సీత అంటే సినిమా మొత్తం మౌనంగా ఉండాలి.
ఒక చోట కుదురుగా కూర్చునే సీత పాత్ర కన్నా కూడా దశరథుడి భార్యగా, రాముడిని కనక పోయిన పెంచిన తల్లిగా, చెప్పుడు మాటలు విని రాముడిని అడవులకు పంపిన గయ్యాళి గా, భరతుడికి తల్లిగా, దశరథుడు ఇచ్చిన మాట కోసం పంతం నెగ్గించుకున్న భార్యగా ఈ పాత్రలో అనేక వేరియేషన్స్ ఉన్నాయ్.

ఈ పాత్ర మీరు తప్ప ఎవరు చేసిన బాగా పండదు అని బాపు రమణలు చెప్పగానే ఆమె కూడా ఒప్పుకుంది.ఇలా కైక పాత్ర ఆమెకు బాగా నప్పింది.అలాగే ఈ సినిమాలో చేసిన చంద్రకళకు సీత పాత్ర వల్ల పెద్దగా పేరు రాలేదు.
మన తెలుగు వారికి అప్పటికి ఇప్పటికి సీత అంటే కేవలం అంజలి దేవి ( Anjali Devi )మాత్రమే.ఆమె కన్ను ముసినప్పుడు తెలుగింటి సీతమ్మ కన్నుమూత అని పత్రికలు పెద్ద పెద్ద హెడ్డింగ్స్ పెట్టి వేశారంటే ఆమెను సీతగా జనాలు ఎంతగా యాక్సెప్ట్ చేసారో మనం అర్ధం చేసుకోవచ్చు.
ఈ రామాయణం అంశం ప్రభాస్ ఆదిపురుష్ కారణం గా మరోమారు చెప్పుకోవాల్సిన అవసరం వచ్చింది.పురాణాలూ వర్ధిల్లాలి.







