ఖమ్మం జిల్లా సత్తుపల్లిలో ప్రభుత్వ గుర్తింపు లేకుండా నడుపుతున్న నారాయణ , శ్రీ చైతన్య( Sri Chaitanya ) విద్యాసంస్థలను మూసివేసి యాజమాన్యంపై చర్య తీసుకోవాలని ప్రగతిశీల ప్రజాసౌమ్య విద్యార్థి సంఘాల సత్తుపల్లి)( Sathupally ) టౌన్ కమిటీ ఆధ్వర్యంలో స్థానిక నారాయణ స్కూల్ ముందు ధర్నా చేయడం జరిగింది.ఈ కార్యక్రమంలో సంఘం ఖమ్మం జిల్లా ప్రధాన కార్యదర్శి వెంకటేష్ పాల్గోని మాట్లాడుతు సత్తుపల్లి నగరం లో ఉన్న శ్రీ చైతన్య, నారాయణ విద్యాసంస్థలు పర్మిషన్ లేకుండానే ఇటు విద్యార్థులను అటు విద్యార్థి తల్లిదండ్రులను మోసంచేస్తున్నారని వారు ఆవేదన వ్యక్తం చేశారు…దానికి నిదర్శనమే మిలీనియం స్కూల్ నందు శ్రీచైతన్య విద్యా సంస్థలు , రామన్ స్కూల్ నందు నారాయణ విద్యా సంస్థలంటూ పర్మిషన్ లేకుండానే ధర్జాగా పాఠశాలలు నడుపుతున్న పరిస్థితి నేడు సత్తుపల్లి లో కనిపిస్తుందాన్నారు.
కావున తక్షణమే జిల్లా విద్యాశాఖ అధికారులు స్పందించి విద్యార్థులను మోసం చేస్తున్నా శ్రీ చైతన్య, నారాయణ యాజమాన్యం పై కేసులు బూక్ చేయాలని ప్రభుత్వన్ని డీమాండ్ చేశారు.విద్యార్థి సంఘ నాయకులు, మరియు విద్యార్థుల తల్లి తండ్రులు ఎన్ని సార్లు విద్యాశాఖ అధికారుల దృష్టికి తీస్కొని పోయిన కూడా చెర్యలు తీసుకోపోవడం ఏంటాని తక్షణమే MEO మరియు DEO స్పందించాకుంటే ఈ విద్యాసంస్థలకు విద్యార్థులు మేమే అ విద్యాసంస్థలకు తాళం వేస్తామని, సంబంధిత యాజమాన్యం పై చర్య తీసుకుంటామని హెచ్చరించారు.
పి.డి.ఎస్.యూ విద్యార్థి సంఘం( PDSU) నాయకులు పదే పదే ప్రకటనలు చేస్తు విద్యాశాఖ అధికారుల దృష్టికి తీస్కొని పోయిన కూడా విద్యాశాఖఅధికారుల చర్య తీసుకునే విషయంలో ఎందుకు తాత్సారం చేస్తున్నారు.
వారికి….ఈ యాజమాన్యాలకు ఉన్నటువంటి రిలేషన్ ఏంటి?అనేది తల్లిదండ్రులు అర్థం చేసుకోవాలన్నారు గుర్తింపు లేని పాఠశాలలో చదివితే,భవిష్యత్తులో ఆ పిల్లలకు జరిగే నష్టానికి ప్రభుత్వమే బాధ్యత వహించాల్సి వస్తుందని పిడిఎస్ యూ గా డిమాండ్ డిమాండ్ చేస్తున్నామన్నారు.ప్రభుత్వ నిబంధనలకు వ్యతిరేకంగా వేలాది రూపాయలు ఫీజులు పిండుకుంటున్నటువంటి నారాయణ, చైతన్య విద్యాసంస్థలు విచారణ జరపాలని లేనిపక్షంలో పెద్ద ఎత్తున ఉద్యమానికైనా వెనుకాడబొమన్నారు… ఈ కార్యక్రమం లో PDSU సత్తుపల్లి పట్టణ కార్యదర్శి కె.రమ్య, నాయకులు వేంకటేష్, ప్రభాకర్, తులసి, మనోహర్, తదితరులు పాల్గొన్నారు.







