ఇటీవలే జరుగుతున్న దారుణాలను చూస్తుంటే భవిష్యత్తు కాలంలో మనిషి మనుగడ ఎంత దారుణంగా ఉంటుందో ఊహించుకుంటేనే భయంగా అనిపిస్తుంది.కేవలం చిన్నచిన్న కారణాలకే హత్యలు చేసే వారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది.
భూమి మీద మనిషి ప్రాణాలకు విలువ అనేది లేకుండా పోతుంది.దేశ రాజధాని ఢిల్లీలో జరిగిన సంఘటన గురించి వింటే ఇవన్నీ నిజమే అని ఒప్పుకోక తప్పదు.కేవలం రూ.10 వేల అప్పు విషయంలో జరిగిన గొడవలో అప్పు ఇచ్చిన వ్యక్తి చేతుల్లో అప్పు తీసుకున్న వ్యక్తికి యొక్క ఇద్దరు చెల్లెళ్ళు హత్యకు గురయ్యారు.ఈ ఘటన దేశ రాజధానిలో తీవ్ర కలకలం రేపింది.ఆ వివరాలు ఏమిటో చూద్దాం.

ఢిల్లీ నగరంలోని అంబేద్కర్ బస్తీ కు చెందిన లలిత్( Lalith ) అనే వ్యక్తి తెలిసిన వ్యక్తి దగ్గర రూ.10 వేలు( 10 thousand Rs ) అప్పు తీసుకున్నాడు.అయితే అప్పు ఇచ్చిన వ్యక్తి తన అప్పు తీర్చాలని శనివారం లలిత్ తో గొడవపడ్డాడు.ఇక ఆదివారం అర్ధరాత్రి అప్పు ఇచ్చిన వ్యక్తి కొంతమంది వ్యక్తులతో కలిసి వచ్చి లలిత్ ఇంటి తలుపు తట్టాడు.
మాట మాట పెరగడంతో రాళ్లతో దాడి చేశాడు.ఈ క్రమంలో లలిత్ సోదరుడు తన చెల్లెళ్లతో పాటు బంధువులకు సమాచారం అందించాడు.

లలిత్ చెల్లెలు అక్కడికి వచ్చేలోపే అప్పు ఇచ్చే వ్యక్తి తుపాకితో లలిత్ ను కాల్చే ప్రయత్నం చేస్తూ ఉండగా చెల్లెళ్లయిన పింకీ( Pinkie )(30), జ్యోతి( Jyoti )(28) అడ్డుగా వెళ్లడంతో తీవ్ర గాయాలయ్యాయి.వెంటనే ఆసుపత్రికి తీసుకువెళ్లగా చికిత్స పొందుతూ ప్రాణాలు విడిచారు.ఈ ఘటనపై పోలీసులకు సమాచారం అందడంతో వెంటనే పోలీసులు హాస్పటల్ కి వెళ్లి జరిగిన ఘటనపై ఆరా తీసి కేసు నమోదు చేసి ముగ్గురు వ్యక్తులను అదుపులోకి తీసుకొని అన్ని కోణాల్లో దర్యాప్తు ప్రారంభించారు.







