జనసేన అధినేత పవన్ కల్యాణ్ పై ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి మరోసారి ధ్వజమెత్తారు.పార్టీ స్థాపించిన రోజు నుంచి ఈ రోజు వరకు పవన్ తో ఎవరూ లేరని విమర్శించారు.
పవన్ రాజకీయ వ్యభిచారి అని మండిపడ్డారు.
సర్పవరంలో పవన్ తనపై వ్యాఖ్యలు చేశారన్న ఎమ్మెల్యే ద్వారంపూడి తనను విమర్శించే అర్హత లేదన్న సంగతి తెలుసుకోవాలని సూచించారు.
జనసేన పార్టీని ఎందుకు పెట్టారో చెప్పాలన్నారు.చంద్రబాబు బాగోగులు చూసేందుకు పార్టీ పెట్టారా.? ప్రజల బాగోగులు చూసేందుకు పార్టీ పెట్టారా అని ప్రశ్నించారు.చంద్రబాబు ఇంటికి వెళ్లి ప్యాకేజీపై మాట్లాడుకున్నావు.
కానీ ప్యాకేజీ కుదరకపోవడంతో మళ్లీ ఎమ్మెల్యే చేయండి.సీఎం చేయండి అంటున్నారని విమర్శించారు.
సీఎం కావాలనే కోరికను సినిమాల్లో తీర్చుకోవాలని సూచించారు.







