కోలీవుడ్ ఇండస్ట్రీలోని స్టార్ హీరోలలో ఒకరైన విజయ్ కు( Vijay Thalapathy ) ప్రేక్షకుల్లో ఊహించని స్థాయిలో క్రేజ్ ఉంది.ఏ జానర్ సినిమాలలో నటించినా సక్సెస్ సాధించే సత్తా ఉన్న హీరో విజయ్ అని చెప్పవచ్చు.
విజయ్ ను అభిమానించే ఫ్యాన్స్ సంఖ్య అంతకంతకూ పెరుగుతుండగా విజయ్ తను చేస్తున్న మంచి పనుల ద్వారా కూడా వార్తల్లో నిలుస్తున్నారు.అయితే విజయ్ ఒకమ్మాయికి డైమండ్ నెక్లస్ ( Diamond Necklace ) బహుమతిగా ఇవ్వడం గమనార్హం.
మరోవైపు విజయ్ రాజకీయాలపై ఆసక్తి చూపిస్తుండగా పలు సందర్భాల్లో రాజకీయాల గురించి సైతం కామెంట్లు చేస్తున్న సంగతి తెలిసిందే.విజయ్ చేసిన మంచి పనులను నెటిజన్లు సోషల్ మీడియా వేదికగా షేర్ చేస్తుండటం గమనార్హం.
తాజాగా చెన్నైలో విజయ్ పీపుల్స్ మూమెంట్ లో భాగంగా ఒక ఈవెంట్ జరగగా తాజాగా తమిళనాడు రాష్ట్రంలో ఇంటర్ ఫలితాలు విడుదలైన సంగతి తెలిసిందే.

పరీక్షల ఫలితాలలో టాప్3 లో వచ్చిన వాళ్లకు విజయ్ విజయ్ పీపుల్స్ మూమెంట్ లో భాగంగా వాళ్లను సత్కరించడం గమనార్హం.తాజాగా విడుదలైన ఇంటర్ ఫలితాలలో నందిని ( Nandini ) అనే విద్యార్థిని 600కు 600 మార్కులు సాధించగా డైమండ్ నెక్లస్ ను బహుమతిగా ఇచ్చారు.ప్రస్తుతం ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
తెలుగు నెటిజన్లు సైతం విజయ్ ను ఎంతగానో మెచ్చుకుంటున్నారు.

ఓటుకు నోటు గురించి విజయ్ మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు.విద్యార్థులే భవిష్యత్తు ఓటర్లు అని ప్రస్తుతం డబ్బు ఇచ్చిన వాళ్లకు ఓట్లు వేస్తున్నారని విజయ్ అన్నారు.అంబేడ్కర్, పెరియార్ లాంటి నాయకుల పుస్తకాలు చదవాలని విజయ్ కామెంట్లు చేశారు.
విజయ్ గ్రేట్ అని నెటిజన్ల నుంచి కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.విజయ్ ఒక్కో సినిమాకు 150 కోట్ల రూపాయల రేంజ్ లో రెమ్యునరేషన్ తీసుకుంటున్నారు.







