2023 ఏడాది మొదలై అప్పుడే సగం రోజులు అయ్యింది.ఇది 6వ నెల.
ఈ నెల గడిస్తే ఏడాదిలో సగం పూర్తి అయినట్టే.అయితే ఈ ఏడాది ఇప్పటి వరకు టాలీవుడ్ ప్లానింగ్ ఏమంత గొప్పగా లేవు.
కానీ ముందు రాబోయే 6 నెలలు మాత్రం అదిరిపోయే రేంజ్ లో సినిమాలు రాబోతున్నాయని తెలుస్తుంది.కరెక్ట్ గా చెప్పాలంటే ఆగస్టు నుండి( August ) సినిమాల తాకిడి బలంగా ఉండబోతుంది.
చాలా సినిమాలు పూర్తి అయ్యి పోస్ట్ ప్రొడక్షన్ పనులను జరుపు కుంటున్నాయి.అలాగే రిలీజ్ డేట్స్ ప్రకటించి అందుకు సన్నాహాలు చేసుకుంటున్న సినిమాలు ఉన్నాయి.
చాలా మంది హీరోల చేతిలో రెండు మూడు మించి సినిమాలు ఉన్నాయి.ఈ ఏడాది ఆగస్టు నుండి వచ్చే ఏడాది ఆగస్టు వరకు వచ్చే సినిమాలు కోకొల్లలు.
ఒకేసారి సమాంతరంగా షూట్ లు చేసుకుంటున్న నేపథ్యంలో సినిమాలు ఆలస్యం అవుతూ వస్తున్నాయి.

పవన్ ( Pawan Kalyan )నుండి ఈ ఏడాదిలో రెండు నుండి మూడు సినిమాలు వచ్చిన ఆశ్చర్యం లేదు.ఇక రవితేజ,( Raviteja ) చిరు,( Chiranjeevi ) విజయ్ దేవరకొండ, నాని వంటి హీరోల నుండి ఈ సమయంలో రెండు నుండి మూడు సినిమాలు రాబోతున్నాయి.అలాగే స్టార్ హీరోల సినిమాలు కూడా క్యూ కట్టే అవకాశం ఉంది.
అందరు ఒకేసారి సినిమాలు పూర్తి చేస్తూ ఉన్నారు.

వీరి సినిమాలు ఈ ఏడాది చివరి నుండి క్యూ కట్టనున్నాయి.డిసెంబర్ నుండి ఒక్కో సినిమా రిలీజ్ కు రెడీ అవ్వబోతుంది.అలాగే తమిళ్, మలయాళ సినిమాలు కూడా తెలుగులో రిలీజ్ అయ్యేందుకు సిద్ధం అవుతున్నాయి.
చిన్న పెద్ద మొత్తం కలిపి ఈ ఏడాది ఆగస్టు నుండి వచ్చే ఏడాది ఆగస్టు వరకు 150కి పైగానే ఉన్నట్టు టాక్.దీంతో ప్రతీ వారం చిన్న హీరో కానీ పేడ్ హీరో సినిమా కానీ రిలీజ్ అయ్యే అవకాశం అయితే ఉంది.







