పిఠాపురం( Pithapuram ) వారాహి విజయ యాత్రలో పవన్ కళ్యాణ్( Pawan Kalyan ) సంచలన వ్యాఖ్యలు చేయడం జరిగింది.అధికారంలో లేకపోతేనే ప్రభుత్వం జనసేన పార్టీకి( Janasena Party ) గడగడలాడిపోతుంది.
కనీసం 2019 ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలిపించి ఉంటే… చాలా దోపిడీని ఆపి ఉండేవాడిని.నేను పెద్దగా చదువుకోకపోయినా గానీ పబ్లిక్ పాలసీ మీద రోజుకి ఐదు నుంచి ఆరు గంటల వరకు ఏదో రకంగా చదువుతూనే ఉంటున్నాను అవగాహన తెచ్చుకుంటున్నాను.
మేధావులతో చర్చిస్తూ ఉంటాను.నాకు ఎవరూ కూడా స్పీచ్ లు రాయరు.
ప్రజా సమస్యలపై అవగాహన కలిగినవాడిని.మొట్టమొదటిసారి దయచేసి అర్ధిస్తున్న… ముఖ్యమంత్రి( Chief Minister ) అవ్వటానికి సిద్ధంగా ఉన్నాను.

ఇంత గుండె దమ్ముగా 2019లో కూడా నేను చెప్పలేదు.ఆ సంగతి నాకు కూడా తెలుసు.సంపూర్ణంగా నాకు అధికారం అప్పచెబితే.దేశంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అత్యంత ఉన్నతమైన రాష్ట్రంగా తీర్చిదిద్దుతా.ఈ ఎన్నికల్లో గెలవడానికి ఎలాంటి వ్యూహమైన అనుసరిస్తాను.అవసరమైతే గొడవలకు దిగుతాను… కొట్లాటకు వెళ్ళమన్న వెళతాను.
ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ఇళ్లల్లో నుంచి.లాక్కొచ్చి మరి కొడతా.
ఏ హాని చేయని సగటు మధ్యతరగతి మనిషి మీద దౌర్జన్యాలు చేస్తే.అలాంటి గూండా గాళ్ళకి జనసేన ప్రభుత్వం ఏర్పడితే నరకం చూపించేస్తాను.
అంటూ పవన్ కళ్యాణ్ పిఠాపురం సభలో సంచలన వ్యాఖ్యలు చేశారు.







