రాజన్న సిరిసిల్ల జిల్లా: వరుస దొంగతనాలతో ఉలిక్కిపడుతున్న మండల ప్రజలు వివరాల్లోకి వెళితే రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలం నిజామాబాద్ గ్రామంలోని ఎల్లమ్మ దేవాలయం లో గుర్తు తెలియని దుండగులు సీసీ కెమెరా వైర్లను కట్ చేసి దేవాలయం తలుపులు పగులగొట్టి
గుడి గంటలు, దేవుడి బంగారు కండ్లు, ఎలక్ట్రానిక్ వస్తువులు సుమారు లక్ష రూపాయల విలువ గల వస్తువులను దొంగలించినట్లు స్థానికులు తెలిపారు.కోనరావుపేట మండలంలోని నిమ్మపల్లి,సుద్దాల ,నిజమాబాద్ , కోనరావుపేట గ్రామాలలో వరుస దొంగతనాలు జరుగుతుండడంతో ప్రజలు భయాందోళనకు గురి అవుతున్నారు.
పోలీస్ ల నిఘా రాత్రి పూట మరింత పెంచాలని ప్రజలు కోరుతున్నారు.







