మహారాష్ట్ర తరువాత.. ఆ రాష్ట్రాలే కే‌సి‌ఆర్ టార్గెట్ ?

ప్రస్తుతం తెలంగాణ ముఖ్యమంత్రి కే‌సి‌ఆర్( CM KCR ) మహారాష్ట్రపై గట్టిగా ఫోకస్ చేసిన సంగతి తెలిసిందే.ఆ రాష్ట్రంలో బి‌ఆర్‌ఎస్ ను తిరుగులేని శక్తిగా నిలపాలని కే‌సి‌ఆర్ గట్టి పట్టుదలగా ఉన్నారు.

 Kcr's Target After Maharashtra Are Those States, Maharashtra Politics , Kcr, Brs-TeluguStop.com

ఇప్పటికే ఆ దిశగా చేసున్న అన్నీ ప్రయత్నాలు కొంత మేర విజయం సాధిస్తున్నాయి.ఇతర పార్టీలలోని నేతలు, నాయకులు, తటస్థ వాదులు,.

ఇలా చాలమంది బి‌ఆర్‌ఎస్ లో చేరేందుకు ఆసక్తి చూపిస్తున్నారు.అటు మహారాష్ట్ర ప్రజల్లో బి‌ఆర్‌ఎస్ పై రోజు రోజుకు సానుకూలత ఏర్పడుతోంది.

ఈ నేపథ్యంలో ఆ రాష్ట్రంలో ఏ పార్టీతోను పొత్తు పెట్టుకోబోమని కే‌సి‌ఆర్ స్పష్టం చేశారు.

Telugu Chandigarh, Haryana, Punjab, Shiv Sena, Uttar Pradesh-Politics

రాష్ట్రంలో జరిగే ప్రతి ఎన్నికలోను బి‌ఆర్‌ఎస్ సింగిల్ గా బరిలోకి దిగుతుందని, రాబోయే రోజుల్లో బి‌ఆర్‌ఎస్( BRS party ) అత్యంత బలమైన పార్టీగా రూపుదిద్దుకోబోతుందని కే‌సి‌ఆర్ ఇటీవల చెప్పుకొచ్చారు.మహారాష్ట్రలో తొలిసారిగా వార్ధా రోడ్ లో బి‌ఆర్‌ఎస్ పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించిన తరువాత కే‌సి‌ఆర్ పై విధంగా చెప్పుకొచ్చారు.ఇదిలా ఉంచితే ప్రస్తుతం మహారాష్ట్ర రాజకీయాల్లో( Maharashtra politics ) చురుకుగా పాల్గొంటున్న కే‌సి‌ఆర్.

తన తదుపరి టార్గెట్ ఏ రాష్ట్రంపైనా అనే చర్చ ఎప్పటి నుంచో జరుగుతోంది.ముఖ్యంగా మహారాష్ట్ర తరువాత ఏపీపై కే‌సి‌ఆర్ దృష్టి సారించనున్నాడనే గుసగుసలు వినిపిస్తున్నప్పటికి.ఏపీపై ఇప్పుడప్పుడే దృష్టి పెట్టెలా కనిపించడం లేదు కే‌సి‌ఆర్.

Telugu Chandigarh, Haryana, Punjab, Shiv Sena, Uttar Pradesh-Politics

మహారాష్ట్ర తరువాత ఉత్తరప్రదేశ్, చండీఘడ్, హర్యానా, పంజాబ్ వంటి రాష్ట్రాల్లో బి‌ఆర్‌ఎస్ ను విస్తరించనున్నట్లు కే‌సి‌ఆర్ తాజాగా స్పష్టం చేశారు.ప్రస్తుతం ఈ నాలుగు రాష్ట్రాలు కూడా రాజకీయ సంక్షోభంతో కొట్టుమిట్టాడుతున్నాయి.ఆ కారణంతోనే అక్కడ బి‌ఆర్‌ఎస్ ఎంట్రీ ఇస్తే.

వేగంగా బలపడుతుందనే ఆలోచనలో కే‌సి‌ఆర్ ఉన్నట్లు తెలుస్తోంది.ప్రస్తుతం మహారాష్ట్రలో కూడా శివసేన( Shiv Sena ), నేషనలిస్ట్ కాంగ్రెస్, బీజేపీ వంటి పార్టీలు తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నాయి.

ఈ నేపథ్యంలో బి‌ఆర్‌ఎస్ ఎంట్రీ ఇచ్చి అందరి దృష్టిని ఆకర్షించింది.అదే విధంగా హర్యానా, చండీఘడ్, పంజాబ్, ఉత్తర ప్రదేశ్ వంటి రాష్ట్రాలలో ఎంట్రీ ఇస్తే ఒక్కసారిగా అందరి దృష్టి బి‌ఆర్‌ఎస్ పై పడే అవకాశం లేకపోలేదు.

మొత్తానికి ప్రస్తుతం కే‌సి‌ఆర్ ఫోకస్ అంతా నార్త్ రాష్ట్రాలపైనే ఉన్నట్లు అర్థమౌతోంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube