Heroines : సీతాదేవి పాత్రకు పూర్తిస్థాయిలో న్యాయం చేసి తమ నటనతో మెప్పించిన హీరోయిన్స్ వీళ్లే!

రామాయణం ఆధారంగా ఇప్పటికే తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఎన్నో సినిమాలు విడుదలైన విషయం తెలిసిందే.అయితే రామాయణం ఆధారంగా తెరకెక్కిన సినిమాలు అన్నీ కూడా ఇప్పటివరకు సూపర్ హిట్ గా నిలిచాయి.

 Nayantara To Kriti Sanon Who Played Sita On Big Screen-TeluguStop.com

ఇది ఇలా ఉంటే రామాయణం ఆధారంగా నేడు ప్రభాస్ నటించిన ఆది పురుష్ సినిమా విడుదలైన తెలిసిందే.ఇందులో రాముడి పాత్రలో ప్రభాస్ నటించిన సీత పాత్రలో కృతి సనన్ ( Kriti Sanon )నటించింది.

మరి ఈ సందర్భంగా ఇప్పటివరకు వెండితెరపై సీతగా నటించి అలరించిన ఆరుగురు హీరోయిన్ ల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం.

Telugu Jayapradha, Kriti Sanon, Nayantara, Playedsita, Tollywood-Movie

అలనాటి నటి, తెలుగు తొలి సినిమా నటీమణి సురభి కమలాబాయి( Surabhi Kamalabai ) సీత పాత్రలో నటించి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు.1932లో వచ్చిన రామ పాదుక పట్టాభిషేకం చిత్రంలో సీతాదేవిగా నటించి ప్రేక్షకులను మెప్పించారు.అలాగే తెలుగు, తమిళ చిత్రాలతో వెండితెరపై అలరించిన అలనాటిని పుష్పవల్లి( Pushpavalli ) కూడా సీతాదేవి పాత్రలో మెప్పించారు.1936లో వచ్చిన సంపూర్ణ రామయణం సినిమాలో బాల సీతగా నటించింది.ఆధ్యాత్మిక పాత్రలో ఒదిగిపోయి అప్పటి ప్రేక్షకులను అలరించారు.అలాగే జానకీ పాత్రలో నటించిన మరో అలనాటి నటి త్రిపుర సుందరి( Tripura Sundari ).1994లో విడుదల అయిన శ్రీ సీతా రామ జననం సినిమాతో వెండితెరపై అలరించారు.

Telugu Jayapradha, Kriti Sanon, Nayantara, Playedsita, Tollywood-Movie

చక్కటి నటనతో అప్పటి ప్రేక్షకులను మెప్పించారు.ఘంటశాల బలరామయ్య దర్శకుడు.ఈ చిత్రంలో రాముడిగా అక్కినేని నాగేశ్వర్ రావు నటించారు.అదేవిధంగా సీనియర్ నటి జయప్రద కూడా సీతాదేవి పాత్రలో నటించి మెప్పించింది.బాపు దర్శకత్వంలో 1976లో విడుదల అయిన సీతా కళ్యాణం చిత్రంలో జానకీ పాత్రలో అలరించింది.అలాగే లేడి సూపర్ స్టార్ నయనతార సీతాదేవి ప్రాతలో నటించిన విషయం తెలిసిందే.2011లో వచ్చిన శ్రీ రామ రాజ్యం చిత్రంలో నందమూరి బాలకృష్ణ తో కలిసి చక్కటి నటనతో మెప్పించారు.ఆధ్యాత్మికత ఉట్టిపడేలా నటించింది.

ఇకపోతే నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఆదిపురుష్ లో బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కృతి సనన్ సీత నటించింది.పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ రాఘవుడిగా నటించిన విషయం తెలిసిందే.

ఇప్పటికే సీతాదేవిగా కృతి మంచి ప్రశంసలు అందుకుంటోంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube