సుశాంత్ సింగ్ రాజ్ పుత్…( Sushant Singh Rajput ) నిన్నటి నుంచి ఆయన మూడో వర్ధంతి గురించి సోషల్ మీడియాలో అన్ని వెబ్సైట్లో అలాగే వార్తాపత్రికల్లో కూడా అనేక వార్తలు కనిపిస్తున్నాయి.చాలా మంది సుశాంత్ యొక్క పాత ఫోటోలను షేర్ చేస్తూ తమ యొక్క సంతాపాన్ని తెలియజేస్తున్నారు.
సుశాంత్ లాంటి నటుడు ఇక ఉండడు, సుశాంత్ చాలా నిజాయితీ పరుడు లేదా సుశాంత్ చావుకి వారే కారణం అంటూ రకరకాల కామెంట్స్ చాలా రోజుల నుంచి చేస్తూనే ఉన్నారు నెటిజన్స్.అయితే బయట ప్రపంచానికి తెలియని సుశాంత్ వ్యక్తిగత జీవితం లేదా వ్యక్తిగత ప్రవర్తన ఎంతో మందికి ఆశ్చర్యాన్ని కలిగించక మానదు.

సుశాంత్ అంటే నిజానికి చాలా మందికి ఇష్టం.ఆయనతో నటించడం నటీమణులకు అయితే మరింత ఇష్టం.చాలాసార్లు సుశాంత్ తన హీరోయిన్స్ ని స్టేజ్ పైన ప్రొటెక్ట్ చేస్తూ వచ్చేవాడు.వారు కూర్చునే విధానంలో ఏదైనా ఇబ్బంది కలుగుతుందంటే వారికి వెళ్లి అడ్డుగా నిలబడేవాడు.
సుశాంత్ వారి పక్కన ఉంటే ఎంతో సేఫ్ అని ఫీలయ్యారు కొంతమంది బాలీవుడ్ హీరోయిన్స్.( Bollywood Heroines ) సుశాంత్ తో నటిస్తే చాలా కంఫర్ట్ అని ఫీల్ అయ్యేవారు అయితే ఆయన మరణించిన తర్వాత ఆయనకు సపోర్ట్ గా బాలీవుడ్ లో ఒక్కరు కూడా బయటకు వచ్చి మాట్లాడింది లేదు.
ఎవరైనా అవసరం ఉన్నంత వరకే వాడుకుంటారు అని బాలీవుడ్ మరోసారి రుజువు చేసింది.ఒక జంతువు చనిపోతే ఆ జంతువు చుట్టూ 10 జంతువులు వచ్చి చేరుతాయి.
ఒక కోతి చనిపోతే 10 కోతులు ఆ చనిపోయిన కోతి చుట్టూ కూర్చొని ఏడుస్తాయి.కానీ బాలీవుడ్ అంతకన్నా దారుణం.

తమ తోటి నటుడు ఇక అవకాశాలు రావేమో అనే బాధతో డిప్రెషన్ లోకి వెళ్లి ఆత్మహత్య చేసుకుని చనిపోతే ఒక్కరు కూడా సానుభూతి చెప్పింది లేదు.ఏదో మొక్కుబడిగా చెప్పేసి ఆ ఒక్కరోజు బాధపడ్డారేమో కానీ నేటికీ అతడి చావుకి సమాధానం దొరకలేదు.సుశాంత్ అభిమానులు ప్రతి నిత్యం అతని చావుకు కారణం బాలీవుడ్ నెపోటిజం( Bollywood Nepotism ) మాత్రమే అందుకు కారణం అంటూ నిప్పులు చెరుగుతున్న నిమ్మకు నీరెత్తనట్టుగా ఉంటాయి కొన్ని గ్రూప్స్.నిజానికి వీళ్ళందర్నీ తీసుకెళ్లి జైల్లో పెట్టి ఉరి తీయాలి.
ఎందుకంటే వారి మూకుమ్మడి కంపెనీలు లేదా ఆ స్నేహాలు కొంత మంది మరణానికి కారణం అవుతున్నాయి అంటే అదేమీ చిన్న విషయం కాదు కదా.ఈరోజు సుశాంత్ కి అన్యాయం జరిగినట్టు రేపు ఎంతో మందికి జరిగే అవకాశం ఉంటుంది ఇకనైనా మేల్కోండి.







