రాచకొండ డీసీపీ రైతులకు క్షమాపణ చెప్పాలి:ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి

యాదాద్రి భువనగిరి జిల్లా

: త్రిబుల్ ఆర్ భూ పోరాటంలో జైలుకి వెళ్లిన రాయగిరి రైతులకు భూములు ఉన్నాయన్న రాచకొండ డిసిపి వెంటన ఆ వ్యాఖ్యలను వెనక్కి తీసుకొని,రాయగిరి రైతులకు క్షమాపణ చెప్పాలని మాజీ మంత్రి, భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి డిమాండ్ చేశారు.బుధవారం ఆయన బెయిల్ పై విడుదలైన రాయగిరి రైతులను స్థానిక కాంగ్రెస్ నాయకులతో కలిసి పరామర్శించారు.

 Rachakonda Dcp Should Apologize To The Farmers Mp Komatireddy Venkatareddy Detai-TeluguStop.com

అనంతరం మీడియాతో మాట్లాడుతూ రైతుల పట్ల అవగాహన లేకుండా మాట్లాడిన రాచకొండ డిసిపి ఐపీఎస్ చదువుకున్నవా ఇదేనా నీ జ్ఞానం…? అంటూ ప్రశ్నించారు.ప్రభుత్వం చెప్పినట్లు డిసిపి మాట్లాడడం కరెక్ట్ కాదన్నారు.

రైతులపై డిసిపి చేసిన వ్యాఖ్యలను ఉపసంహరించుకొని, పెట్టిన అక్రమ కేసులను ఎత్తివేయాలని,లేనట్లయితే అధికార పార్టీ నాయకులు రేపటి నుంచి ఈ ప్రాంతంలో ఎలా తిరుగుతారో చూస్తానని హెచ్చరించారు.

ఆర్ఆర్ఆర్ లో సీఎం కేసీఆర్ లక్షల కోట్ల స్కామ్ చేశారని,భూ సేకరణ కేంద్రానికి సంబంధం లేదని,కేంద్ర రవాణా శాఖ మంత్రి చెప్పారన్నారు.

ట్రిపుల్ ఆర్ భూ సేకరణ రాష్ట్ర ప్రభుత్వమే చేస్తుందన్నారు.రాయగిరి రైతులకు సంకెళ్లు వేయడంతో రాష్ట్రంలో రైతులు కన్నీళ్లు పెట్టుకుంటున్నారని,పోలీసు అధికారులారా ప్రభుత్వం మాటలు వినవద్ధని,కేసీఆర్ ప్రభుత్వం ఉండేది ఇంకా ఆరునెలల మాత్రమేనని,ఇప్పుడున్న బీఆర్ఎస్ ఎమ్మెల్యేలలో ఒక్కరూ కూడా గెలిచేవారు లేర‌ని, ఈ ప్రభుత్వం వచ్చేది కూడా లేదన్నారు.

కేసీఆర్ కి పోయేకాలం దగ్గరకు వచ్చింది కాబట్టే ఓఆర్ఆర్ అమ్మిండని,ఓఆర్ఆర్ అమ్మిండు అంటేనే రాష్టం మొత్తం దివాళా తీసేలా చేసిండని అర్ధమని విమర్శించారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube