కొంతమంది హీరో హీరోయిన్ల పేరెంట్స్ ఏంటో అసలు అర్థం కాదు.వాళ్ళు ఒక హోదాలో ఉన్నారని తెలిసినప్పటికీ కూడా ఇప్పటికి వాళ్లను చిన్న వారిలాగా ట్రీట్ చేస్తూ ఉంటారు.
ఇప్పటికీ వారికి సలహాలు ఇస్తూ ఉంటారు.వాళ్ళు చెప్పిందే చేయాలి అని అంటుంటారు.
అలా హీరోయిన్ శ్రీ లీల( Heroine Sreeleela ) తల్లి కూడా శ్రీ లీల విషయంలో అలానే చేస్తుందని తెలిసింది.శ్రీలీల వద్దన్నా కూడా కొన్ని పనులు బలవంతంగా చేయిస్తుందట.
ఇంతకు అసలు విషయం ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.
సినీ ఇండస్ట్రీకి చిన్నవయసులోనే హీరోయిన్ గా పరిచయమైంది శ్రీలీల.
ఏకంగా రెండవ సినిమా స్టార్ హీరో తో చేయటంతో ఆమె క్రేజ్ బాగా పెరిగిపోయింది.ఇప్పుడు ఎక్కడ చూసినా ఈమె పేరే వినిపిస్తుంది.
ముఖ్యంగా కుర్రాళ్లకు క్రష్ గా మారింది ఈ బ్యూటీ.శ్రీలీల తొలిసారిగా ముద్దు అనే కన్నడ సినిమాతో 2019లో అడుగు పెట్టగా.
ఈ సినిమా మంచి సక్సెస్ అయ్యింది.

ఇక 2021 లో పెళ్లి సందD సినిమాలో( Pelli sandadi movie ) నటించి తన తొలి చూపులతోనే తెలుగు ప్రేక్షకుల మనసులు దోచుకుంది.ఈ ఒక్క సినిమాతో టాలీవుడ్ లో ఓవర్ నైట్ స్టార్ గా మారింది.గత ఏడాది మాస్ మహారాజ్ రవితేజ నటించిన ధమాకా సినిమాలో( Dhamaka movie ) హీరోయిన్ గా నటించగా ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది.
అంతేకాకుండా భారీ అవకాశాలు కూడా అందుకుంది.ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ ఖాతాలో వరుసగా 12 సినిమాలు ఉన్నాయి.
శ్రీ లీల సోషల్ మీడియాలో కూడా బాగా సమయాన్ని గడుపుతూ ఉంటుంది.నిత్యం తనకు సంబంధించిన ఫోటోలను, సినిమా అప్డేట్లను పంచుకుంటూ ఉంటుంది.
ఇక చూడటానికి చాలా అందంగా ఉండే ఈ ముద్దుగుమ్మకు కుర్రాళ్ళు ఫిదా అవుతూ ఉంటారు.ఈమె ఏదైనా ఫోటో పెడితే చాలు అది క్షణాల్లో వైరల్ అవుతుంది.
ఇదంతా పక్కన పెడితే ఈ బ్యూటీ గురించి ఒక వార్త బాగా వైరల్ అవుతుంది.

శ్రీ లీల చిన్నప్పటినుంచి చాలా కూల్ గా ఉంటుందట.అయితే తనకు బాగా చిల్ అవ్వటం చాలా ఇష్టమట.అలా ఉండాలని.
ఫ్రెండ్స్ పార్టీలు తిరగాలి అని ఆశ ఎక్కువ ఉండేదట.అలా తనకున్న ప్యాషన్ కారణంగా వాళ్ళ అమ్మ సినిమా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చేలా చేసిందట.
ఇక సినిమా షూట్స్ లేకపోయినా తన చదువులో ఏమాత్రం తీరిక దొరికినా వెంటనే తనను కిచెన్ లోకి పంపించేస్తుందట.
తన పని తాను చేసుకునే విధంగా ఆమె తన కూతురుకి ట్రైన్ చేస్తుందట.
అయితే శ్రీలీలకు మాత్రం మొదటి నుంచి కిచెన్ అన్న.ఇంటి పనులన్న పెద్దగా ఇష్టం చూపించదట.
కానీ అమ్మ కోసం మాత్రం శ్రీ లీల ఇంటి పనులు, వంట పనులు నేర్చుకుంటుందట.శ్రీలీల అమ్మ ఎవరి పనులు వాళ్ళు చేసుకోవాలి అనే టైప్ కు చెందిన వ్యక్తి.
కాని శ్రీలీల మాత్రం తల్లికి పూర్తిగా వ్యతిరేకమట.ఇలా శ్రీలీలకు ఇష్టం లేకుండానే బలవంతంగా పనులు చేయిస్తూ కొన్నిసార్లు ఇబ్బంది పెడుతుందట తన తల్లి.







