చాలా మంది తెలుగు హీరోలతో పోలిస్తే మాస్ మహారాజ్ రవితేజ( Raviteja ) నటించే తీరులోను, వ్యవహరించే పద్ధతి లోనూ, సినిమాల ఎంపిక లో కూడా చాలా వ్యత్యాసం కలిగి ఉంటాడు.రవితేజ ఎనర్జీతో పోలిస్తే ఆయనతో తెలుగు సినిమా ఇండస్ట్రీలో మరొక హీరో సాటి రాడు.
రవితేజ ఫ్యామిలీ విషయాలు కూడా చాలా తక్కువగానే బయటకు తెలుస్తూ ఉంటాయి.మీడియాలో ఆయన గురించి రూమర్స్ కానీ మరో విషయం కానీ గాసిప్ అయ్యే అవకాశము ఇవ్వడు.
ఇక రవితేజ సినిమాల విషయానికొస్తే అతడు పెద్దపెద్ద దర్శకులతో సినిమాలు తీయాలని ఎప్పుడూ ఆలోచించలేదు.పది సినిమాలకు పైగా తీసిన దర్శకుడికి వంగి వంగి సలాం కొట్టలేను అని రవితేజ భావిస్తాడని ఇండస్ట్రీలో కొంతమంది చెప్పుకుంటూ ఉంటారు.

అందుకే రెండు లేదా మూడు సినిమాలు తీసిన దర్శకులకే అతడు పిలిచే అవకాశం ఇస్తాడట.ఎంతమంది కుర్ర దర్శకులు( Young Directors ) వచ్చిన ఆ కథల వినడానికి టైం ఇస్తాడట.సినిమా హిట్ అయిన ఫ్లాప్ అయినా కథ నచ్చితే( Movie Story ) ఎల్లప్పుడూ అవకాశం ఇవ్వడానికి ప్రయత్నిస్తాడు.ఒకవేళ సినిమా మొదలైన తర్వాత ఏదైనా తేడా అనిపిస్తే మాత్రం రవితేజ వ్యవహరించే శైలి పూర్తిగా మారిపోతుందట.
రవితేజకు ఒక్కసారి సినిమాలో ఏదో తేడా కొడుతున్నట్టు షూటింగ్ కొంత భాగం జరిగిన తర్వాత అనిపిస్తే కనుక ఆ దర్శకుడికి ఇక మూడిందనే అర్థం.అవతలి వ్యక్తి చిన్నవాడా పెద్దవాడా అనే సంబంధం లేకుండా తాట తీస్తాడట.
అందుకే కథను నమ్ముకుని తీసే దర్శకులకు రవితేజ ఇంటి తలుపులు ఎప్పుడు తెరిచే ఉంటాయి.

గత సినిమాల దర్శకులకు రవితేజ తో ఉన్న అనుబంధం విషయానికి వస్తే ఒక దర్శకుడుతో ఎక్కువ సినిమాలు తీయడానికి ఒప్పుకోడు.ఫ్రెష్ దర్శకుడు మరియు కాస్టింగ్ కి ప్రయారిటీ ఇస్తాడు.ఎంత పెద్ద హీరోయిన్ అయినా కూడా రవితేజతో చాలా కంఫర్టబుల్ గా నటిస్తారు.అందుకే టాలీవుడ్ లో చాలామంది హీరోలతో పోలిస్తే రవితేజ చాలా కంఫర్టబుల్ నటుడు.50 ఏళ్ల వయసు పైబడిన కూడా కుర్ర హీరలతో సమానంగా సినిమాలు తీస్తున్నాడు.మరో పదేళ్లపాటు అతని హీరోగా రాణిస్తాడు అనడంలో ఎలాంటి సందేహం లేదు.







