ఏలూరు జిల్లాలో మహిళపై యాసిడ్ దాడి ఘటన దురదృష్టకరమని ఏపీ హోంమంత్రి తానేటి వనిత అన్నారు.యాసిడ్ దాడికి పాల్పడిన వారు ఎంతటి వారైనా శిక్ష తప్పదని ఆమె తెలిపారు.
బాధితురాలికి వెంటనే ప్రభుత్వ ఆస్పత్రిలో వైద్యం అందించారని హోంమంత్రి తానేటి వనిత పేర్కొన్నారు.అనంతరం మెరుగైన వైద్యం కోసం మణిపాల్ ఆస్పత్రికి తరలించారని చెప్పారు.
బాధితురాలికి జగన్ ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.







