9నెలల చిన్నారి వరల్డ్ వైడ్ ఇంటర్నేషనల్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లో చోటు..!

పిల్లల ఐక్యూ గుర్తించి మంచి శిక్షణ ఇస్తే పిల్లలు చేసే అద్భుతాలు మాటలలో వర్ణించలేము.పిల్లల టాలెంట్ గుర్తించి వారి భవిష్యత్తును తీర్చిదిద్దితే ఉన్నత శిఖరాలకు చేరుకోవడానికి పెద్దగా సమయం పట్టదు.9 నెలల చిన్నారి వరల్డ్ వైడ్ ఇంటర్నేషనల్ బుక్ ఆఫ్ రికార్డ్స్ ( International Book of Records )లో చోటు దక్కించుకుంది అంటే నమ్మడానికే కాస్త ఆశ్చర్యం అనిపిస్తుంది.ఎందుకంటే ఆ వయసులో కనీసం నడక కూడా సరిగా ఉండదు.

 A Place In The World Wide International Book Of Records For 9 Months Old Baby ,-TeluguStop.com

కానీ ఓ చిన్నారి తొమ్మిది నెలల వయసులోనే ఓ అరుదైన ఘనత సాధించింది.ఆ వివరాలు ఏమిటో చూద్దాం.

ఆంధ్రప్రదేశ్ లోని అనకాపల్లి జిల్లా రేబాకకు చెందిన వెంకటనారాయణమూర్తి, తేజస్విని దంపతులకు 9 నెలల లాస్విక ఆర్య( Lasvika Arya ) అనే అమ్మాయి సంతానం.ఈ చిన్నారికి ఆరు నెలల వయసు ఉన్నప్పటి నుంచి కూరగాయల బొమ్మలను గుర్తించడం, జంతువుల బొమ్మలు గుర్తించడం లో తల్లి శిక్షణ ఇచ్చింది.

Telugu Baby, General, International, Lasvika Arya, Latest Telugu, Tejaswini-Late

ఇక చిన్నారి తొమ్మిది నెలల వయసులోకి వచ్చాక 3.36 నిమిషాలలో 11 రకాల కూరగాయలను, జంతువుల బొమ్మలను గుర్తించింది.లాస్విక తల్లిదండ్రులు ఈ బొమ్మలు గుర్తించిన వీడియోను మార్చి నెలలో వరల్డ్ వైడ్ ఇంటర్నేషనల్ బుక్ ఆఫ్ రికార్డుకు పంపించారు.ఈ వీడియోను పరిశీలించి లాస్విక ఆర్య ప్రతిభను గుర్తించి బంగారు పథకం, ప్రశంసా పత్రాలను మంగళవారం అనకాపల్లి జిల్లా రేబాక గ్రామానికి పంపించారు.

ప్రస్తుతం లాస్విక తల్లిదండ్రులతో పాటు గ్రామస్తులు కూడా పట్టలేని సంతోషంలో మునిగి తేలుతున్నారు.

Telugu Baby, General, International, Lasvika Arya, Latest Telugu, Tejaswini-Late

9 నెలల చిన్నారికి వరల్డ్ వైడ్ ఇంటర్నేషనల్ బుక్ ఆఫ్ రికార్డు ద్వారా ప్రశంసలు దక్కాయని తెలిసి గ్రామస్తులతో పాటు చుట్టుపక్కల ఉండే గ్రామస్తులు కూడా లాస్విక తల్లిదండ్రులకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.చిన్నారుల మేధస్సును గుర్తించి సరైన శిక్షణలు ఇస్తే వయస్సుతో సంబంధం లేకుండా ఇలాంటి ఎన్నో అద్భుతాలు సాధించే అవకాశాలు ఉంటాయి.అందరూ ఆ చిన్నారి మరెన్నో విజయాలు సాధించాలని ఆశీర్వదిస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube