సూర్యాపేట జిల్లా
:గరిడేపల్లి మండలం రాయినిగూడెం చెరువులో బుధవారం చేపలు పట్టడానికి భారీ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు.చేపలు లూఠీ కాకుండా పోలీసు బందోబస్తు ఉన్నప్పటికీ గ్రామస్థులకు చేపలు ఇవ్వలేదని,గ్రామంలో చేపలు అమ్మడంలేదని ఆగ్రహంతో ఒక్కసారిగా చేపలు కాంటా వేసే ప్రాంతానికి చేరుకొని అందిన వారికి అందిన కాడికి చేపలను ఎత్తుకెళ్లారు.
పోలీసులు పహారా ఉన్నప్పటికి చేపలు ఫలహారం అయ్యాయని కాంట్రాక్టర్ అవేదన వ్యక్తం చేశారు.చేపలను ఎత్తుకెళ్ళే వారిని కట్టడి చేసేందుకు పోలీసులు స్వల్ప లాఠీ ఛార్జ్ చేయల్సి వచ్చింది.
అయినా చేపల కాంట్రాక్టర్ కు మాత్రం భారీ నష్టం వచ్చినట్లు అంచనా వేస్తున్నారు.







