తాజాగా డబ్ల్యూటీసి ఫైనల్( WTC Final ) లో భారత జట్టు ఘోరంగా ఓడిపోవడంతో క్రికెట్ అభిమానుల్లో తీరని నిరాశ నెలకొంది.ఇతర దేశాలతో పోల్చుకుంటే భారత దేశంలో క్రికెట్ అభిమానులు చాలా ఎక్కువ.
భారత్లో నిర్వహించే ఐపీఎల్ వేదికగా ఎంతో మంది యువ ఆటగాళ్లు తమ టాలెంట్ నిరూపించుకొని సత్తా చాటుచున్నారు.కానీ దశాబ్ద కాలంలో ఒక్క ఐసీసీ ట్రోపీ ను కూడా భారత్ గెలవలేకపోయింది.2013 లో ధోని హయాంలో భారత్ ఛాంపియన్ ట్రోఫీ గెలిచింది.ఆ తర్వాత ఫైనల్, సెమీఫైనల్ వరకు వెళ్లి భారత్ ఇంటి ముఖం పడుతుంది.
దీనికి పలు రకాల కారణాలు ఉన్నాయంటూ క్రికెట్ అభిమానులతో పాటు క్రికెట్ నిపుణులు విమర్శిస్తున్నారు.ప్రధానమైన కారణాలు ఏమిటో చూద్దాం.
భారత జట్టు సెలక్షన్
: డబ్ల్యూటీసీ ఫైనల్ లో అశ్విన్( Ravichandran Ashwin ) కు బదులు ఉమేష్ ను సెలెక్ట్ చేశారు.అశ్విన్ బౌలింగ్ తో పాటు బ్యాటింగ్ లో కూడా రాణించగలడు.
అంతేకాదు భరత్ స్థానంలో ఇషాన్ కిషన్ ఆడి ఉంటే ఇంకాస్త బాగుండేది.గతంలో 2019లో అంబటి రాయుడు స్థానంలో విజయ్ శంకర్ అడడం వల్ల ఫలితం ఎలా ఉందో అందరికీ తెలిసిందే.
బీసీసీఐ జట్టు ఎంపిక విషయంలో ఇంకా కాస్త మెరుగైన నిర్ణయాలు తీసుకుంటే బాగుంటుంది.

కీలక ప్లేయర్లకు గాయాలు:
ఐపీఎల్ లో గాయాల కారణంగా డబ్ల్యూటీసి ఫైనల్ పై ఎఫెక్ట్ పడింది.జస్ట్ ప్రీత్ బూమ్రా, పంత్, శ్రేయస్ అయ్య( Jasprit Bumrah )ర్ లేకపోవడం భారత జట్టు విజయాన్ని దెబ్బతీసింది.ముఖ్యంగా ఐపీఎల్ లో అలసిపోయి డబ్ల్యూటీసీ ఫైనల్ లో అద్భుత ఆటను ప్రదర్శించలేకపోయారు.
కాబట్టి కనీసం ఐపీఎల్ తర్వాత ఒక నెల రోజులు గడువు ఉంటే బాగుంటుంది.

టాపార్డర్:
భారత జట్టు మరీ ఎక్కువగా టాపార్డర్ పై ఆధారపడుతోంది.టాపార్డర్ రాణించ లేకపోతే ఒకరు లేదా ఇద్దరిపై ఒత్తిడి పెరిగి విజయం సాధించడం కష్టమవుతుంది.కాబట్టి బీసీసీఐ( BCCI ) అన్ని విధాలుగా ఆలోచించి కేవలం టాపార్డర్ మాత్రమే కాకుండా మిడిల్ ఆర్డర్ లో కూడా జట్టు సమర్థంగా ఉండేటట్టు ఎంపిక చేయాలి.
క్రికెట్ బేసిక్స్:
ఆటగాళ్లు ఫామ్ కోల్పోవడం, చెత్త షాట్లు కొట్టి అవుట్ కావడం, ఒత్తిడి పెరిగినప్పుడు నిరుత్సాహం చెందడం వల్ల గెలిచే మ్యాచ్లు కూడా ఓడిపోవలసి వస్తుంది.మ్యాచ్ మొత్తం ను ఒక్క బాల్ తో మలుపు తిప్పేయొచ్చు అనే కాన్ఫిడెంట్ తో ఆడితేనే క్రికెట్ లో విజయాలు చేరువవుతాయి.
వికెట్లు కోల్పోతున్నప్పుడు ఒత్తిడికి లోనై తప్పులు చేయడంపై భారత జట్టు ప్రత్యేక దృష్టి పెట్టాల్సి ఉంది.







