పవర్ స్టార్ పవన్ కళ్యాణ్( Pawan Kalyan ) లైనప్ లో వరుసగా క్రేజీ ప్రాజెక్టులు ఉన్న విషయం తెలిసిందే.మరి ఈయన లైనప్ ఎంత ఇంట్రెస్టింగ్ గా సాగుతున్నప్పటికీ సినిమాలతో పాటు పాలిటిక్స్ లో కూడా బిజీగా ఉన్నాడు.
జూన్ 14 నుండి తన వారాహి ( Varahi )యాత్రని స్టార్ట్ చేయనున్నట్టుగా పవన్ తరుపు నుండి ఇప్పటికే క్లారిటీ వచ్చింది.అంటే రేపటి నుండి పవన్ కళ్యాణ్ వారాహి యాత్ర స్టార్ట్ కాబోతుంది.
ఈ క్రమంలోనే పవన్ కళ్యాణ్ కు మద్దతుగా ఆయన సినిమా నిర్మాతలు తన యాగంలో భాగం కావడం ఇప్పుడు ఇంట్రెస్టింగ్ గా మారింది.అంతేకాదు సోషల్ మీడియా వేదికగా డివివి ఎంటర్టైన్మెంట్స్, మైత్రి మూవీ మేకర్స్( DVV Entertainments, Mythri Movie Makers ) వారు బెస్ట్ విషెష్ చెప్పడం ఫ్యాన్స్ లో సహా సినీ వర్గాల్లో కూడా హాట్ టాపిక్ గా నిలుస్తుంది.
డివివి వారు ”మీరు వేసే ప్రతి అడుగు విజయ పథం వైపుగా సాగాలని కోరుకుంటున్నాము” అంటూ సోషల్ మీడియా వేదికగా పోస్ట్ చేసారు.

ఇక మైత్రి మూవీ మేకర్స్ వారు ”సమాజ శ్రేయస్సు కోసం మీ సంకల్పం మరియు అంకితభావం ఎల్లప్పుడూ ప్రేరణగా ఉంటాయి.అన్ని విషయాల్లో మీకు మంచి జరగాలని కోరుకుంటున్నాను” అంటూ మంత్రి పోస్ట్ చేసారు.ఇలా వీరు చేసిన పోస్టులు నెట్టింట వైరల్ అవుతున్నాయి.
పవన్ కళ్యాణ్ కు ఇలా ఆయన సినిమాల నిర్మాతలు విషెష్ చెప్పడం అందరికి ఇంట్రెస్టింగ్ గా మారింది.

పవన్ కళ్యాణ్ మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ లో ఉస్తాద్ భగత్ సింగ్( Ustad Bhagat Singh ) చేస్తున్నాడు.హరీష్ శంకర్ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతుంది.ఈ సినిమా ఇప్పటికే ఒక షెడ్యూల్ పూర్తి అయ్యింది.
ఇక డివివి దానయ్య బ్యానర్ లో ఓజి సినిమా తెరకెక్కుతుంది.ఈ సినిమా సుజీత్ దర్శకత్వంలో తెరకెక్కుతుంది.
ఇప్పటికే రెండు మూడు షెడ్యూల్స్ పూర్తి చేసుకోగా ఈ సినిమా కోసం పవన్ వరుస డేట్స్ ఇస్తూ ముందుగా పూర్తి చేయడానికి ఆసక్తి కనిపిస్తుంది.







