వర్షాకాలంలో బైక్‌పై ప్రయాణం చేసేటప్పుడు ఈ జాగ్రత్తలు పాటించండి

వర్షాకాలంలో బైక్‌లపై ప్రయాణం చేసేవారు చాలా జాగ్రత్తగా ఉండాలి.ఎందుకంటే వర్షంలో బైక్ జారి కింద పడే అవకాశం ఉంటుంది.

 Follow These Precautions While Riding A Bike During Monsoons , Winter, Tips, Bik-TeluguStop.com

అలాగే రోడ్లపై నీళ్లు నిలుస్తాయి.దీని వల్ల బైక్ పై వెళ్లేటప్పుడు నీళ్లు పైన పడతాయి.

వర్షాకాలంలో బైక్ నడిపేటప్పుడు తీసుకోవాల్సిన 5 జాగ్రత్తల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

Telugu Bike, Latest, Licence, Care, Tips-Latest News - Telugu

వర్షాకాలం ( rainy season )ప్రారంభానికి ముందే బైక్ ను సర్వీసింగ్‌కు ఇచ్చుకోవడం చాలా మంచిది.దీని వల్ల సీజన్ మొత్తం ఇబ్బంది ఉండదు.మీ బైక్ పాత టైర్లు అరిగిపోయినట్లయితే టైర్లను మార్పించుకోవాలి.

లేకపోతే టైర్లకు పంక్చర్ అవుతుంది.వర్షాకాలంలో వెళ్లేటప్పుడు పాత టైర్లు పట్టును కోల్పోయి స్కిడ్ అయ్యే ప్రమాదం ఉంటుంది.

దీంతో పాత టైర్లు( Old tires ) మార్పించుకోని కొత్త టైర్లు వేయించుకోవడం మంచిది.అలాగే ఇండికేటర్ పనితీరును ఎప్పటికప్పుడు తనిఖీ చేసుకుంటూ ఉండాలి.

ఇండికేటర్లు విరిగిపోయినా లేదా బల్బ్ ప్యూజ్ పోయినా వెంటనే రిపేర్ చేయించుకుని కొత్తది వేయించుకోండి.

Telugu Bike, Latest, Licence, Care, Tips-Latest News - Telugu

అలాగే వర్షాకాలంలో చీకటిగా అనిపిస్తుంది.ఉరుములు, మేఘాలు ఎక్కువగా కమ్ముకున్న సమయంలో చీకటిగా ఉంటుంది.దీంతో హెల్ టైన్ ను ఒకసారి చెక్ చేసుకోవడం మంచిది.

హెడ్ లైట్, టెయిల్ లైట్లు పనిచేయకపోపతే ఇలాంటి సమయంలో ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది.అలాగే బ్రేక్‌లను చెక్ చేయించుకోవాలి.

ఒక్కొక్కసారి బ్రేక్ లు టైట్‌గా బిగుసుకుపోవడం వల్ల బైక్ సమయానికి ఆగదు.దీని వల్ల బైక్ స్కిడ్ అవుతూ ఉంటుంది.

దీంతో బైక్ సర్వీసింగ్ చేయించుకోవడం మంచిది.అలాగే వర్షాకాలంలో హెల్మెట్ తప్పనిసరిగా ధరించాలి.

రోడ్లపై నీళ్లు, తడిగా ఉండటం వల్ల బైక్ స్కిడ్ అయ్యే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది.ఇలాంటి సయంలో హెల్మెట్లు ధరించి ఉండటం వల్ల ఎలాంటి ప్రమాదాలు జరిగినా సేఫ్‌గా బయటపడవచ్చు.

ఈ సూచనలు పాటించడం వల్ల డ్రైవింగ్ సౌకర్యవంతంగా ఉంటుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube