యువతలో గుండె పోటు రావడానికి గల బలమైన కారణాలు ఇవే..!

సాధారణంగా చెప్పాలంటే గుండెపోటు( heart attack ) అనేది ఒకప్పుడు వృద్ధాప్యంలో మాత్రమే వస్తూ ఉండేది.కానీ ప్రస్తుత సమాజంలో 40 సంవత్సరాల కంటే తక్కువ వయసు ఉన్న వారికి కూడా గుండెపోటు రావడం ఆశ్చర్యాన్ని కలుగజేస్తుంది.

 These Are The Strong Reasons For Heart Attack In Youth , Strong Reasons, Health-TeluguStop.com

అయితే ప్రస్తుత సమాజంలో 30 నుంచి 40 సంవత్సరాల మధ్య వయస్సు గల యువకులలో గుండెపోటుతో బాధపడే వారి సంఖ్య పెరుగుతూ వస్తోంది.మారిన జీవనశైలి, శరీరక శ్రమ లేకపోవడం, నిద్ర లేకపోవడం వంటి చెడు అలవాట్ల వల్ల గుండె పై చెడు ప్రభావం పడుతుంది.

యువతలో అధిక రక్తపోటు, మధుమేహం, అధిక కొలెస్ట్రాల్( High blood pressure, diabetes, high cholesterol ) స్థాయిలు పెరుగుతున్నాయి.

Telugu Diabetes, Tips, Heart Attack, Pressure, Cholesterol-Telugu Health Tips

ముఖ్యంగా చెప్పాలంటే ధూమపానం, పొగాకు వాడకం, మాదక ద్రవ్యాల వినియోగం మొదలైన చెడు అలవాట్ల వల్ల గుండె సమస్యలు పెరిగిపోతున్నాయి.వీటిని దూరంగా ఉంచడానికి సమతుల్య జీవన శైలి అనుసరించడం ఎంతో ముఖ్యం.ముఖ్యంగా యువతలో గుండె పోటు రావడానికి గల బలమైన చెడు కారణాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

రక్తంలో అధిక చక్కెర స్థాయిలు రక్తనాళాలను దెబ్బతీస్తాయి.ఇది ధమనులలో కొవ్వు పెరుగుదలకు దారితీస్తుంది.

ఇది రక్త సరఫరాను అడ్డుకుంటుంది.ముఖ్యంగా చెప్పాలంటే గుండె కండరాలను చిక్కగా చేసి గుండె పనితీరుపై చెడు ప్రభావాన్ని చూపుతుంది.

Telugu Diabetes, Tips, Heart Attack, Pressure, Cholesterol-Telugu Health Tips

దీని వల్ల గుండె పోటు వచ్చే అవకాశాలు పెరుగుతాయి.అలాగే అధిక బరువు, ఉబకాయం, గుండెకు హాని చేయడం కూడా చేస్తున్నాయి.మద్యం తాగడం, క్రమ రహిత నిద్ర కారణంగా యువతలో చెడు కొలెస్ట్రాల్ పెరిగిపోతోంది.ఇలాంటివారు బరువు తగ్గించుకొని గుండెను కాపాడుకోవడం ఎంతో ముఖ్యం.ఇంకా చెప్పాలంటే మద్యం సేవించడం వంటి అలవాట్లు గుండె ఆరోగ్యం పై తీవ్రమైన ప్రభావాన్ని చూపిస్తాయి.అలాగే గుండెతో పాటు శరీరంలోని ఇతర అవయవాలపై కూడా చెడు ప్రభావం ఉంటుంది.

కాబట్టి యువత ఈ చెడు అలవాట్లను దూరం చేసుకోవడం ఎంతో మంచిది.సాధ్యమైనంత వరకు ఈ అలవాట్లకు దూరంగా ఉంటే గుండెను రక్షించుకోవచ్చు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube