ప్రస్తుత కాలంలో ఎక్కువమంది స్వార్థంతో జీవనం సాగిస్తున్నారు.లాభం ఉంటే తప్ప పని చేయడానికి కూడా చాలామంది ఆసక్తి చూపడం లేదు.
మొక్కల పెంపకంపై దృష్టి పెట్టే వాళ్లను వేళ్ల మీద లెక్క పెట్టవచ్చు.అయితే ఒక వృద్ధురాలు మాత్రం ఏకంగా 8000 మొక్కలను నాటి తన మంచి మనస్సును చాటుకున్నారు.
పెళ్లై 20 ఏళ్లైనా పిల్లలు పుట్టకపోవడంతో మొక్కలను నాటి ఆ మొక్కలనే పిల్లల్లా పెంచుకున్నారు.ఆ వృద్ధురాలి పేరు సాలుమరద తిమ్మక్క( Saalumarada Thimmakka )కర్ణాటక రాష్ట్రానికి చెందిన ఈ వృద్ధురాలు తుముకూరు జిల్లాలోని గుబ్బి తాలూకాలో జన్మించారు.
క్వారీలో సాధారణ కూలీగా ఈ వృద్ధురాలు కెరీర్ ను మొదలుపెట్టారు.పిల్లలు పుట్టకపోవడంతో మొదట మర్రిచెట్ల పెంపకాన్ని మొదలుపెట్టారు.
మర్రి చెట్ల( Banyan ) పెంపకాన్ని మొదలుపెట్టిన తర్వాత మొక్కలకు నీళ్లను అందించడం కోసం నాలుగు కిలోమీటర్ల దూరం వరకు ఎంతో కష్టపడి నీళ్లను తీసుకెళ్లేవారు.

నాటిన మొక్కలను పశువులు మేయకుండా భర్త సహాయంతో ఆమె కంచెలను కూడా ఏర్పాటు చేశారు.ఈమె నాటిన మర్రిచెట్ల విలువ ఏకంగా 1.5 మిలియన్ రూపాయలు కావడం గమనార్హం.మొక్కల పెంపకం కోసం ఆమె పడిన కృషికి ఫలితంగా పద్మశ్రీ అవార్డ్( Padma Shri award ) వచ్చింది.వర్షపు నీటిని నిల్వ చేయడానికి ట్యాంకులను ఏర్పాటు చేయడం లాంటి సామాజిక కార్యక్రమాల్లో సైతం తిమ్మక్క పాల్గొన్నారు.

ప్రపంచంలోని అత్యంత స్పూర్తిదాయకమైన మహిళల జాబితాలో ఈమె కూడా చోటు సంపాదించుకున్నారు.తిమ్మక్కను మదర్ ఆఫ్ ట్రీస్ అని కూడా పిలుస్తారు.చదువు, డబ్బు లేకపోయినా తిమ్మక్క సమాజానికి చేసిన సేవ అంతాఇంతా కాదు.సాలుమరద తిమ్మక్క గొప్పదనం గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది.ఆమె మొక్కల పెంపకం ద్వారా ఎంతోమందికి స్పూర్తిగా నిలిచారు.ఆమె సేవా కార్యక్రమాలకు దేశ విదేశాల నుండి ఎంతోమంది నుంచి ప్రశంసలు దక్కాయి.







