ఈ రోజుల్లో మగవారికి పెళ్లి కావడమే గగనంగా మారింది.అలాంటిది ఒక యువకుడు అమ్మాయిలో ఒక ప్రత్యేక లక్షణం ఉంటేనే పెళ్లి చేసుకుంటానంటూ భీష్మించుకు కూర్చున్నాడు.
అదేంటంటే తాను ఒక శాఖాహారి అమ్మాయిని( vegetarian girl ) పెళ్లి చేసుకోవాలనుకున్నాడు.చివరకు అతని ఆశయం నెరవేరింది.
ఈ యువకుడు స్వచ్ఛమైన శాఖాహారి కాగా తనలాగే తన భార్య కూడా మాంసాహారం ముట్టని అమ్మాయి అయి ఉండాలని అతడు కోరుకున్నాడు.ఇంతకుముందు వచ్చిన సంబంధాలన్నీ అమ్మాయిలు మాంసాహారులు కావడంతో రిజెక్ట్ చేశాడు.
చివరాఖరికి అతను అనుకున్నట్లే శాకాహారి అమ్మాయి దొరికింది.దాంతో అతడి ఆనందానికి అవధులు లేకుండా పోయాయి.

వివరాల్లోకి వెళితే.మధ్యప్రదేశ్( Madhya Pradesh ) రాష్ట్రం, ఇండోర్ సిటీ, ఖాండ్వా( Indore City, Khandwa ) పరిధిలోని సాయి బాగ్ కాలనీలో అమోల్ వాధ్వానీ( Amol Wadhwani ) నివసిస్తున్నాడు.ఈ యువకుడు రెడీమేడ్ గార్మెంట్స్ బిజినెస్ చేస్తూ పర్యావరణ పరిరక్షణపై పలు రకాల అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నాడు.ఈ మేరకు సైక్లింగ్ చేస్తూ వివిధ ప్రాంతాలకు తిరుగుతున్నాడు.
ఇలా తిరుగుతూ ఉండగా అమోల్‌కు డింపుల్ భాటియా అనే యువతి పరిచయం అయ్యింది.ఈమె అనే పర్యావరణ పరిరక్షణపై అవగాహన కల్పిస్తుండగా అమోల్ పరిచయమయ్యాడు.
అంతేకాదు ఆమె కూడా స్వచ్ఛమైన శాఖాహారి.

వీరిద్దరికీ పర్యావరణ పరిరక్షణ పట్ల ప్రేమ ఉండటం వల్ల కలిసి వారు సైక్లింగ్ చేస్తూ ఉండేవారు.ఆ విధంగా వారి స్నేహం మరింత బలపడింది.ఫుడ్ హ్యాబిట్స్ కూడా సేమ్ ఉండటంతో వీరి మధ్య కాలక్రమేణా ప్రేమ కూడా చిగురించింది.
చివరికి వీరు పెళ్లి చేసుకోవాలని నిర్ణయించారు.జూన్ 9న ఘనంగా పెళ్లి చేసుకొని ఒకటయ్యారు.
వీరి గురించి తెలిసిన చాలామంది ఆశ్చర్యపోతున్నారు.ఆశయం బలంగా ఉంటే ఏదైనా నెరవేరి తీరుతుందని కామెంట్లు పెడుతున్నారు.







