ఎప్పుడూ లేని విధంగా తెలంగాణ బిజెపిలో గ్రూపు రాజకీయాలు పెరిగిపోయాయి.ఒకరిపై ఒకరు ఆధిపత్య ధోరణితో వ్యవహరిస్తూ, అధిష్టానం పై ఒకరిపై ఒకరు ఫిర్యాదులు చేసుకుంటూ, గత కొంతకాలంగా తెలంగాణ బీజేపీలో గందరగోళం సృష్టిస్తున్నారు.
అసలు గ్రూపు రాజకీయాల పేరు చెబితే ముందుగా గుర్తు వచ్చేది తెలంగాణ కాంగ్రెస్.ఆ పార్టీలో ఉన్న గ్రూప్ రాజకీయాలు మరే పార్టీలోనూ కనిపించవు.
ఇప్పుడిప్పుడే ఆ పార్టీ పరిస్థితి మెరుగవుతోంది.అధికారంలోకి రావాలనే పట్టుదలతో కాంగ్రెస్ పని చేస్తుంది.
కర్ణాటక ఎన్నికల ఫలితాలు కాస్త మార్పు తీసుకువచ్చాయి.కానీ ఎప్పుడు గ్రూపు రాజకీయాలు కనిపించని బిజెపిలో మాత్రం ఈ మధ్యకాలంలో బాగా గ్రూపులు పెరిగిపోయాయి.
కొత్త పాత నేతల మధ్య పెరిగిన ఈ గ్రూపు రాజకీయాలు రాబోయే ఎన్నికల్లో తీవ్ర ప్రభావం చూపించే అవకాశం ఉండడంతో , బిజెపి శ్రేణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.

ఈ వ్యవహారం ఇలా ఉండగానే తెలంగాణ బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్( Bandi Sanjay ) ను మార్చబోతున్నారని , ఆయన స్థానంలో మరో కీలక నేతకు బాధ్యతలు అప్పగించబోతున్నారనే ప్రచారం ఈ మధ్యకాలంలో పెరిగిపోయింది. ఆదివారం బిజెపి సీనియర్ నేతలంతా మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి ఇంట్లో సమావేశం అయ్యారు.ఈ సమావేశం అనంతరం తెలంగాణ బిజెపి అధ్యక్షుడి మార్పు జరగడం లేదని, అవన్నీ ఒట్టి పుకార్లేనని వారు క్లారిటీ ఇచ్చారు.
ప్రస్తుతం తెలంగాణలో సీనియర్ నాయకులు కొంతమంది గ్రూపులు గా విడిపోయి ఎవరికి వారు ఢిల్లీకి వెళ్లి బిజెపి జాతీయ పెద్దలలో సమావేశం అవుతూ, మిగతా నాయకులకు ఫిర్యాదు చేస్తుండడం వంటివి మీడియా, సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.కొంతమంది నాయకులు రాష్ట్ర నాయకత్వంతో సంబంధం లేకుండానే ఢిల్లీ తో పాటు, వివిధ రాష్ట్రాల్లో పర్యటిస్తూ సమావేశాలు నిర్వహిస్తున్నారు.
తెలంగాణ బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్ ను మార్చుతారని, బీసీలకు సీఎం పదవి దక్కబోతోందని, ప్రచార కమిటీ చైర్మన్ గా ఈటల రాజేందర్ ( Etela Rajender )ను తప్పించి మరొకరికి అవకాశం ఇవ్వబోతున్నారని, ఇలా రకరకాల ప్రచారాలు ఈ మధ్యకాలంలో పెరిగిపోయాయి.

ముఖ్యంగా పార్టీ అధ్యక్ష పదవి కోసం ప్రచార కమిటీ చైర్మన్ పదవి కోసం పార్టీలో కీలక బాధ్యతలను చేపట్టేందుకు హుజురాబాద్ బిజెపి ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ ప్రయత్నిస్తున్నారనే ప్రచారం ఈ మధ్యకాలంలో పెరిగిపోయింది.ఈ నేపథ్యంలో నే మాజీ ఎంపీలు డాక్టర్ బూర నరసయ్య గౌడ్ ,విజయశాంతి, వివేక్, కొండ విశ్వేశ్వర్ రెడ్డి, రవీందర్ నాయక్ ఉద్యోగ సంఘం నేత విఠల్, దేవయ్య ,మాజీ మంత్రి విజయ రామారావు తదితరులు జితేందర్ రెడ్డి నివాసంలో సమావేశమై ఈటెల రాజేందర్ వ్యవహారంపై చర్చించారు.పార్టీ సంక్షోభానికి ఈటెల రాజేందర్ కారణం అవుతున్నారని అభిప్రాయపడ్డారు.
ఒక పథకం ప్రకారం కేసీఆర్( CM KCR )కేసీఆర్ ఈ వ్యవహారాలను నడిపిస్తున్నారనే అనుమానాలు వ్యక్తం చేశారు.బిజెపి కమాండ్ ఈ విషయం సీరియస్ గా తీసుకోవాలని ఈ సందర్భంగా సదర నాయకులు అభిప్రాయపడ్డారు ఇక బండి సంజయ్ కు మద్దతుగా తామంతా ఉన్నామని ఈ సమావేశం అనంతరం క్లారిటీ ఇచ్చారు.
దీంతో తెలంగాణ బిజెపిలో బండి సంజయ్ , ఈటెల రాజేందర్ వర్గాలుగా పార్టీ విడిపోయిందనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.







