కుక్కకి ( dog )ఉన్న విశ్వాసం మరే జంతువుకు, మనిషికి ఉండదంటే అతిశయోక్తి కాదు.వీటికి ఎంత విశ్వాసం ఉంటుందో కళ్ళకు కట్టినట్లు హచీ: ఎ డాగ్స్ టేల్, 777 చార్లీ వంటి సినిమాలు చూపించి ఏడిపించేసాయి.కుక్కల గొప్పతనం ఒక యజమానికి మాత్రమే తెలుస్తుంది.మనసున్న యజమానులు తమ విశ్వసనీయమైన కుక్కల కోసం ఏదైనా చేస్తారు.వాటిని సంతోషపెట్టాలని ఎల్లప్పుడూ తపన పడుతుంటారు.వాటికి ఏదైనా అయితే వారు తమ సొంత బిడ్డలకు చెడు జరిగినంతగా బాధపడతారు.
అయితే తాజాగా ఒక యజమాని ఎంతో ప్రేమగా పెంచుకుంటున్న కుక్కకి క్యాన్సర్( Dog has cancer ) వచ్చింది.ఆ కుక్కంటే స్థానికులు అందరికీ కూడా ఇష్టమే.
దాంతో వారు హత్తుకునే రీతిలో దాని చివరి నడకకు హార్ట్ టచింగ్ వీడ్కోలు పలికారు.వివరాల్లోకి వెళితే.
అమెరికాలోని పెన్సిల్వేనియాలోని డుపాంట్ పట్టణంలో మెల్లో( mellow ) అనే కుక్క నివసిస్తోంది.మెల్లో, అతని యజమాని కెవిన్ కర్రీ( Kevin Curry ) 2019 నుంచి పట్టణంలో కలిసి నడవడానికి అలవాటు పడ్డారు.
అయితే, ఇటీవలే, మెల్లోకి వేగంగా వ్యాపించే లింఫోమా క్యాన్సర్( Lymphoma is cancer ) ఉన్నట్లు నిర్ధారణ అయింది.దీని వల్ల ఆ కుక్క నడవడం కష్టమైంది.
అంతేకాకుండా అది ఈ బతికి ఉండడానికి మరికొద్ది రోజుల సమయం మిగిలి ఉంది.

అయితే మెలోపై తమ ప్రేమను, మద్దతును తెలియజేసేందుకు పట్టణ వాసులు దానికి ప్రత్యేకంగా వీడ్కోలు నిర్వహించారు.శనివారం నాడు, కెవిన్ కర్రీ పట్టణం గుండా చివరి నడకలో మెలోను నడిపించాడు.కమ్యూనిటీకి చెందిన చాలా మంది వ్యక్తులు నడకలో వారితో జాయిన్ అయ్యారు, మరికొందరు తమ పొరుగువారి మెయిల్‌బాక్స్‌లలో మెలో కోసం స్వీట్ నోట్స్ కూడా ఉంచారు.

కెవిన్ కర్రీ సోషల్ మీడియాలో వారు వెళ్ళే మార్గం మ్యాప్‌ను పంచుకున్నారు.అతను తన జీవితంలో అనుభవించిన ప్రేమ, ఆనందానికి మెల్లోకి కృతజ్ఞతలు తెలిపారు.మెల్లో తరఫున ఫేస్‌బుక్ పోస్ట్ కూడా షేర్ చేశారు.ఫైనల్ వాక్‌లో మెల్లో డాగ్ చూ చూస్ అనే స్థానిక దుకాణం నుంచి ఉచిత ఐస్ క్రీం ట్రీట్‌ను అందుకుంది.
మెల్లోకి ఒక చిరస్మరణీయమైన, అద్భుతమైన సెండ్-ఆఫ్ ఉండేలా స్థానికులు అందరూ ఏర్పాట్లు చేశారు.ఈ ఫైనల్ వాక్ ప్రతి ఒక్కరికీ హార్ట్ టచింగ్, సాడ్ మూమెంట్‌గా నిలిచింది.







