ఉమ్మడి పాలమూరు జిల్లాలో రాజకీయ సమీకరణాలు మారుతున్నాయి.మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు వరుసగా కాంగ్రెస్ నేతలతో సమావేశాలు నిర్వహిస్తున్నారు.
ఇందులో భాగంగా ఇవాళ భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డితో జూపల్లి భేటీ అయ్యారు.ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారని తెలుస్తోంది.
కాగా జూపల్లి పార్టీ ముఖ్యనేతలను కలుస్తున్న నేపథ్యంలో కాంగ్రెస్ లో ఆయన చేరిక తథ్యమనే వార్తలు వినిపిస్తున్నాయి.అయితే నిన్న మల్లు రవితో జూపల్లి సమావేశమై చర్చించిన సంగతి తెలిసిందే.