జనసేన - టీడీపీ పొత్తు కలిస్తే... లోకేష్‌ సీటు కిందకి నీళ్లు వచ్చే పరిస్థితి

ఏపీ లో మరో ఏడాదికి అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్న విషయం తెల్సిందే.గత ఎన్నికల్లో వైకాపా అధ్బుతమైన విజయాన్ని సొంతం చేసుకుంది.

 Alliance Between Tdp And Jana Sena Parties Details, Bjp, Janasena, Tdp, Nara Lok-TeluguStop.com

సోలో విజయాన్ని సొంతం చేసుకున్న వైకాపా మరో సారి అధికారాన్ని దక్కించుకునేందుకు ప్రయత్నాలు చేస్తుంది.మరో వైపు పొత్తు తో అయినా జగన్‌ ను గద్దె దించాలని తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నారు.

ఇటీవలే తెలుగు దేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు( Chandrababu Naidu ) స్వయంగా వెళ్లి ఢిల్లీ లో బీజేపీ నాయకులతో మంతనాలు జరిపిన విషయం తెల్సిందే.మరో వైపు తెలుగు దేశం పార్టీ( TDP ) మరియు జనసేన పార్టీ లు( Janasena ) పొత్తు పెట్టుకోబోతున్నారు.

తెలుగు దేశం పార్టీ మరియు జనసేన పార్టీ లు పొత్తు పెట్టుకుంటే సీట్ల సర్దు బాటు విషయం లో చాలా చర్చలు జరపాల్సి రావచ్చు.ముఖ్యంగా మంగళగిరి స్థానం విషయంలో చర్చ జరిగే అవకాశాలు ఉన్నాయి.గత ఎన్నికల్లో లోకేష్ ( Nara Lokesh ) ఆ స్థానం నుండి పోటీ చేసి ఓడి పోయాడు.దాంతో అక్కడ తన పట్టు పెంచుకునేందుకు తీవ్రంగా ప్రయత్నించాడు.

మళ్లీ అక్కడే పోటీ చేయాలని తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నాడు.

కానీ జనసేన పార్టీ నాయకులు మాత్రం మంగళగిరి ని తమకు కేటాయించాలని డిమాండ్‌ చేస్తున్నారు.అక్కడ జనసేన పార్టీకి మంచి పట్టు ఉంది.అందుకే పవన్ అక్కడ పోటీ చేయాలని కూడా కొందరు డిమాండ్ చేస్తున్నారు.

ఎక్కడ నుండి పోటీ చేస్తాడు అనేది తెలియదు కానీ ముందు ముందు మంగళగిరి విషయంలో మాత్రం కచ్చితంగా తెలుగు దేశం పార్టీ మరియు జనసేన పార్టీ ల మధ్య పోటీ ఏర్పడే అవకాశాలు ఉన్నాయి.ఆ ఒక్క సీటు వల్ల పొత్తు విషయంలో కూడా విభేదాలు తలెత్తే అవకాశం ఉంది అంటూ రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube