సెర్బియా పబ్ లో ఉ అంటావా పాటకు డాన్స్ ఇరగదీసిన సమంత.. వీడియో వైరల్!

క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ (Sukumar)దర్శకత్వంలో అల్లు అర్జున్ (Allu Arjun) రష్మిక (Rashmika)హీరో హీరోయిన్లుగా నటించిన చిత్రం పుష్ప(Pushpa).ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకుల ముందుకు వచ్చి ఎంతో అద్భుతమైన విజయాన్ని అందుకుంది.

 Samantha Danced To Oo Antava Song In Serbian Pub Details, Samantha,serbia Pub,pu-TeluguStop.com

ఇక ఈ సినిమాలో స్పెషల్ సాంగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.ఉ అంటావా మావా… ఊ అంటావా మావా అంటూ సమంత (Samantha) అద్భుతమైన డాన్స్ పెర్ఫార్మెన్స్ చేశారు.

దేవి శ్రీ ప్రసాద్ (Devisri Prasad) అందించిన సంగీత స్వరాలు అందరిని ఎంతగానో ఆకట్టుకున్నాయి.ఇక ఈ పాట దేశ విదేశాలలో కూడా మంచి ఆదరణ సంపాదించుకోవడం విశేషం.

ఇప్పటికీ ఈ పాట ఎక్కడైనా వినిపించిన మనకు తెలియకుండానే మన బాడీలో కదలికలు మొదలవుతూ ఉంటాయి.అంతలా ఈ పాట ప్రతి ఒక్కరిని ఆకట్టుకుందనే చెప్పాలి.ఇక ఈ పాట ద్వారా సమంతకు పాన్ ఇండియా స్థాయిలో కూడా ఎంతో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ వచ్చిందని చెప్పాలి.ఈమె నటించిన ఫస్ట్ స్పెషల్ సాంగ్ ఇలా మంచి గుర్తింపు సంపాదించుకోవడం విశేషం అయితే తాజాగా ఈ పాట సెర్బియా పబ్(Serbia Pub) లో వినిపించడంతో ఒక్కసారిగా సమంత ఆశ్చర్యపోయారు.

ప్రస్తుతం సమంత సిటాడెల్ (Citadel) వెబ్ సిరీస్ షూటింగ్ లో బిజీగా ఉన్నారు.

ఈ క్రమంలోనే ఈ టీమ్ మొత్తం సెర్బియా వెళ్లారు.అయితే షూటింగ్ సమయంలో విరామం దొరకడంతో నటి సమంత వరుణ్ ధావన్ (Varun Dhavan) ఇతరులు సరదాగా సెర్బియాలోని బెల్ గ్రేడ్ పబ్బుకు వెళ్లారు.అక్కడ సమంత నటించిన ఉ అంటావా మావా… ఊ అంటావా మావా అనేసాంగ్ ప్లే చేయడంతో సమంత ఒక్కసారిగా ఆశ్చర్యపోవడమే కాకుండా ఈ పాటకు సమంతను డాన్స్ చేయాలని చెప్పడంతో ఆమె మరోసారి ఈ పాటకు డాన్స్ చేస్తూ అందరిని సందడి చేశారు.

ఇలా సమంత సెర్బియా పబ్ లో చేసిన ఈ డాన్స్ కు సంబంధించిన ఫోటోలు వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube