తూర్పు ఆఫ్రికా ఖండం సోమాలియా దేశం ఎక్కువగా ఉగ్రవాద దాడులకు గురవుతుంటుంది అన్న సంగతి తెలిసిందే.నిత్యం ఎక్కడో ఒకచోట ఉగ్రవాద దాడులు జరుగుతూనే ఉంటాయి.
తాజాగా శనివారం సోమాలియాలోని ఫుట్ బాల్ స్టేడియంలో బాంబు పేలడంతో 27 మంది మరణించినట్లు అంతర్జాతీయ మీడియా తెలియజేసింది.ఇదే ఘటనలో 53 మంది తీవ్ర గాయాలు పాలయ్యారు.
చనిపోయిన వారిలో ఎక్కువమంది చిన్నారులే ఉన్నారు.
అంతకుముందు శుక్రవారం సోమాలియా రాజధాని మొగదిషులోని బీచ్ సైడ్ హోటల్ లో “ఇస్లామిక్ అల్ శబబ్” ఉగ్రవాదులు ఆరు గంటలపాటు జరిపిన దాడుల్లో ఆరుగురు పౌరులు మరణించగా పదిమంది గాయాలు పాలయ్యారు.ఇదిలా ఉంటే గత 15 సంవత్సరాల నుండి ఆల్ ఖైదాకు అనుబంధంగా పనిచేస్తున్న జీహాదీలు… సోమాలియాలో ప్రజా ప్రభుత్వాన్ని దించేందుకు భారీ ఎత్తున దాడులకు తెగబడుతున్నారు.ఈ క్రమంలో విదేశీయులు, అధికారులనే టార్గెట్ చేసుకొని దాడులు చేస్తున్నారు.
అయితే శనివారం మరియు శుక్రవారం ఉగ్రవాదులు జరిపిన దాడుల నుండి 84 మందిని భద్రతా బలగాలు కాపాడాయి.ఉగ్రవాదులను అణిచివేయడానికి భద్రతా బలగాలు తీవ్రస్థాయిలో శ్రమిస్తున్నాయి.సోమాలియాకి హసన్ షేక్ మొహమ్మద్ అధ్యక్షుడు అయిన తరువాత ఉగ్రవాదులకు వ్యతిరేకంగా “ఆల్ అవుట్ వార్” అనే ఆపరేషన్ ద్వారా ఉగ్రవాదులను అణిచివేసే కార్యక్రమం స్టార్ట్ చేశారు.దీంతో దేశంలో చాలా నగరాలు మరియు పట్టణాల నుంచి ఉగ్రవాదులను భద్రతాబలగాలు తరిమేస్తున్నాయి.
ఉగ్రవాదులు ప్రభావం ఎక్కువగా ఉన్నచోట్ల ముఖ్యంగా దక్షిణ ప్రాంతాలలో… వారి ప్రభావం ఉండటంతో అక్కడే తాజా సంఘటన జరిగింది.శనివారం జరిగిన ఈ దుర్ఘటనలో 27 మంది మరణించగా 53 మంది తీవ్ర గాయాలు పాలయ్యారు.