ఇటీవల కాంగ్రెస్ పార్టీ కీలక నేత రాహుల్ గాంధీ( Rahul Gandhi ) విదేశీ పర్యటనలు చేపట్టడం తెలిసిందే.ఈ పర్యటనాలలో పలు చోట్ల ప్రసంగాలు చేస్తూ దేశ అంతర్గత రాజకీయాల గురించి ఇంకా అనేక విషయాలు గురించి మాట్లాడుతున్నారు.
ఈ క్రమంలో విదేశాలలో రాహుల్ ప్రసంగాలపై అమిత్ షా( Amit Sha ) తాజాగా సీరియస్ అయ్యారు.దేశాన్ని అగౌరవపరిచే రీతిలో విదేశాలలో రాహుల్ వ్యవహరిస్తున్నారని.
ఆరోపించారు.దేశాన్ని ఎలా గౌరవించాలో రాహుల్ తన పూర్వీకుల నుంచి నేర్చుకోవాలని అమిత్ షా సూచించారు.
ప్రధాని మోడీ( PM Modi ) నేతృత్వంలో కేంద్ర ప్రభుత్వం 9 ఏళ్ల పాలన పూర్తి అయిన సందర్భంగా గుజరాత్ లో పటాన్ జిల్లా సిద్ధాపూర్ పట్టణంలో శనివారం నిర్వహించిన బహిరంగ సభలో అమిత్ షా ఈ వ్యాఖ్యలు చేయడం జరిగింది.ఎలాంటి దేశభక్తుడైన దేశ రాజకీయాలు గురించి దేశంలోనే మాట్లాడాలని సూచించారు.విదేశాలకు వెళ్లి స్వదేశీ రాజకీయాల గురించి చర్చించి దేశాన్ని తక్కువ చేయకూడదని పేర్కొన్నారు.రాహుల్ చేస్తున్న వ్యాఖ్యలు ప్రజలు గమనిస్తున్నారని చెప్పుకొచ్చారు.భారత్ లో వేసవి తాపాన్ని తప్పించుకునేందుకు రాహుల్ విదేశీ పర్యటనలు చేస్తున్నారని.అలా వెళ్లి దేశం పై విమర్శలు చేస్తున్నారని అమిత్ షా సంచలన వ్యాఖ్యలు చేయడం జరిగింది.