గగన్ యాన్ కోసం సిద్ధమౌతున్న టాటా ఎలిక్సీ వెహికల్.. వివరాలివే?

అవును, టాటా గ్రూప్ ( Tata Group )ఇపుడు ఏకంగా ఆకాశాన్ని దాటి, అంతరిక్షమే హద్దుగా దినదినాభివృద్ధి చెందుతోంది.ఇప్పటికే ఎయిర్ ఇండియా ద్వారా విమాన రంగంలో దుమ్ముదులుపుతున్న టాటా గ్రూప్ ఇప్పుడు ఇస్రోకు సపోర్ట్ చేసేందుకు సంసిద్ధం అయింది.2024లో ఇండియా నిర్వహించనున్న గగన్‌యాన్ మిషన్ కోసం ఒక కీలకమైన ప్రోడక్ట్ ను రెడీ చేసి ఇవ్వనుంది టాటా గ్రూప్.విషయం ఏమంటే, గగన్‌యాన్ మిషన్ ( Gaganyan Mission )కు సంబంధించిన ఇస్రో (ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్) రికవరీ టీమ్‌కి శిక్షణ ఇవ్వడానికి CMRM (క్రూ మాడ్యూల్ రికవరీ మోడల్స్)ని టాటా ఎలిక్సీ తాజాగా అభివృద్ధి చేసింది.

 Tata Eleksi Vehicle Being Prepared For Gagan Yan Details, Tata Eleksi, Vehicle,-TeluguStop.com

Telugu Gagan Yan, Prepared, Tata Eleksi, Vehicle-Latest News - Telugu

2024లో గగన్‌యాన్ మిషన్లో భాగంగా అంతరిక్షానికి పంపించే వ్యోమగాములను( Astronauts ) తిరిగి సురక్షితంగా భూమికి తీసుకొచ్చే ల్యాండింగ్ ప్రక్రియను ఇస్రో ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపడుతోంది.ఈ నేపథ్యంలో… ఇప్పటికే 2 క్రూ మాడ్యూల్ రికవరీ మోడల్స్ ను కేరళలోని కొచ్చి, ఆంధ్రప్రదేశ్ లోని విశాఖ పట్నంలలో ఉన్న నౌకాదళ శిక్షణా బృందాలకు టాటా ఎలిక్సీ ( Tata Elixir )ఆల్రెడీ అందించింది.భూమికి 400 కిలోమీటర్ల దూరంలోని కక్ష్యలో వ్యోమగాములు 3 రోజుల పాటు గడిపిన తర్వాత వారిని భూమికి తీసుకొస్తారు.ఈ క్రమంలో సముద్ర జలాల్లో మొదట ల్యాండింగ్ ఉంటుంది.

వ్యోమగాముల ల్యాండింగ్ కు సాయం అందించడానికి కేరళలోని కొచ్చి, ఆంధ్రప్రదేశ్ లోని విశాఖ పట్నంలలో ఉన్న నౌకాదళంలో కొంతమందికి ఇస్రో ఇపుడు ట్రైనింగ్ ఇస్తోంది.

Telugu Gagan Yan, Prepared, Tata Eleksi, Vehicle-Latest News - Telugu

వ్యోమగాములు పారాచూట్ల సాయంతో సముద్ర జలాల్లో నిర్దిష్ట ప్రదేశంలో మొదటగా ల్యాండ్ అవుతారు.అలా వారు ల్యాండ్ కాగానే టాటా ఎలిక్సీకి చెందిన క్రూ మాడ్యూల్ రికవరీ మోడల్స్ లో నౌకాదళ సిబ్బంది వేగంగా వెళ్లి వారిని చాలా జాగ్రత్తగా పికప్ చేసుకుంటారు.ఆ సమయంలో వారికి ఎలాంటి ఆపద రాకుండా చూసుకుంటారు.

అంతేకాకుండా, అంతరిక్ష వాతావరణం నుంచి భూమి వాతావరణంలోకి రాగానే వ్యోమగాములకు అందించాల్సిన ప్రాథమిక చికిత్సకు అవసరమైన ఏర్పాట్లన్నీ ఇక్కడ CMRMలో అందుబాటులో ఉంటాయి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube