కుక్క కరిస్తే ఎలాగుంటుందో తెలిసిందే.. అదే మనిషి కరిస్తే ఇంకెంత దారుణంగా ఉంటుందో తెలుసా?

మీలో ప్రతిఒక్కరికీ కుక్క కరిస్తే( Dog Bite ) ఎలా ఉంటుందో తెలిసిందే.అందుకే కుక్క కాస్త అలా తన పళ్లతో టచ్ చేసినా చాలు.

 Florida Man Infected With Flesh-eating Bacteria From Human Bite Details, Viral N-TeluguStop.com

వెంటనే మనం ర్యాబిస్‌ వ్యాధి రాకుండా ఇంజెక్షన్‌లు తీసుకుంటాం.అదేవిధంగా ఆహార నియమాలు కూడా బాగానే పాటిస్తాం.

అయితే కుక్క కాటు కంటే మనిషి కరిస్తేనే( Human Bite ) అత్యంత ప్రమాదం అని ఎంతమందికి తెలుసు? అలా మనిషి కరిస్తే ఓ వ్యక్తి కోలుకోవడానికి 6 నెలల పడుతుందట.అవును, ఈ విచిత్ర ఘటన ఫ్లోరిడాలో( Florida ) చోటు చేసుకుంది.

Telugu Donnie Adams, Flesh Bacteria, Florida, Bite, Latest-Latest News - Telugu

విషయంలోకి వెళితే, డోని ఆడమ్స్‌ అనే అతను ఫిబ్రవరిలో టంపా బేలో ఒక కుటుంబ కార్యక్రమానికి హాజరయ్యాడు.అక్కడ అనుకోకుండా ఓ గొడవ జరిగింది.దీంతో ఇరువైపుల బంధువులు కలబడ్డారు.వారిని విడదీసేందకు మధ్యలో కలగజేసుకున్న ఈ ఆడమ్స్‌ని ఒక వ్యక్తి కోపంతో మోకాలిపై గట్టిగా కరిచాడు.దీంతో అతను నైక్రోటైజింగ్‌ షాసిటిస్‌ వ్యాధి బారినపడ్డాడు.దీనిని సాధారణంగా మాంసం తినే భ్యాక్టీరియా అని అంటారు.

దీని కారణంగా శరీరీం మెల్లమెల్లగా కుళ్లిపోతూ ఇన్ఫెక్షన్‌కు గురై చనిపోతారు.ఈ వ్యాధి నెమ్మదిగా చర్శంలోకి ప్రవేశించి కండరాల తొడుకు ఉండే ఆరోగ్యకరమైన కణజాలాన్ని నాశనం చేస్తుంది.

Telugu Donnie Adams, Flesh Bacteria, Florida, Bite, Latest-Latest News - Telugu

ఈ ఘటన కారణంగా ఆడమ్స్‌ ఆస్పత్రి పాలయ్యాడు.వెంటనే శస్త్ర చికిత్స చేయకపోతే ప్రాణాంతకమని వారు చెప్పారు.ఈ నేపథ్యంలో కుక్క కాటు కంటే మనిషి కాటు ఎంత ప్రమాదమో వైద్యులు అతనికి వివరించి చెప్పారు.ఇంకేముంది కట్ చేస్తే శస్త్ర చికిత్సలో భాగంగా ఆడమ్స్‌కి 70 శాతం కణజాలాన్ని తొలగించాల్సి వచ్చింది.

ఈ శస్త్ర చికిత్స త్వరిత గతిన చేయకపోతే గనుక ఆడమ్స్‌ కాలుని కోల్పోవలసి ఉండేదని ఆరోగ్య నిపుణులు అన్నారు.ఇకపోతే అతను కోలుకోవడానికి 3 వారాలు పడితే.

పూర్తి స్థాయిలో కోలుకోవడానికి దాదాపు 6 నెలల సమయం పట్టింది.దీంతో ఆడమ్స్‌ ఈ భయానక ఘటన నుంచి కోలుకునేలా చేసిన వైద్యులకు రుణపడి ఉంటానంటూ కన్నీళ్లు పెట్టుకున్నాడు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube