ఇండస్ట్రీ లో అగ్ర నిర్మాతలుగా కొనసాగుతున్న వారిలో దగ్గుపాటి సురేష్ బాబు( Daggubati Suresh Babu ) కూడా ఒకడు.మూవీ మొఘల్ రామానాయుడు లక్షణాలను ఒణికిపుచ్చుకొని వెంకటేష్ లాగ సినీ నటుడు కాకుండా, నిర్మాతగానే కెరీర్ ని సాగిస్తూ వచ్చాడు.
అయితే రామానాయుడు డేరింగ్ డాషింగ్ నిర్మాత.ఆ రోజుల్లో ఆయన ఎన్టీఆర్ మరియు నాగేశ్వర రావు వంటి వారితో భారీ బడ్జెట్ సినిమాలు తీసి సూపర్ హిట్స్, బ్లాక్ బస్టర్ హిట్స్ మరియు ఇండస్ట్రీ హిట్స్ కూడా అందుకున్నాడు.
అలాగే భారీ బడ్జెట్ తో తీసి ఫ్లాప్ అయ్యినవి కూడా చాలానే ఉన్నాయి.హిట్ వచ్చినప్పుడు ఆయన పొంగిపోలేదు, అలాగే ఫ్లాప్ వచ్చినప్పుడు కూడా ఆయన కృంగిపోలేదు.
డబ్బులు ఆయన ఆరోజుల్లో అలా ఖర్చు చేసేవాడు.కానీ సురేష్ బాబు అందుకు పూర్తి గా విరుద్ధం.
ఎలాంటి రిస్క్ పెట్టుకోకుండా తక్కువ బడ్జెట్ తో సినిమాలు తీసేసి థియేటర్స్ లో విడుదల చేసుకుంటాడు.
ఒకవేళ సినిమా ఆడదు అని అనిపిస్తే మాత్రం థియేటర్స్ లో విడుదల చెయ్యకుండా ఓటీటీ లోనే నేరుగా విడుదల చేసేస్తాడు.ఆయన పెట్టిన ప్రతీ పైసా కి పది రూపాయిలు లాభం వస్తుంది అంటేనే ఏ పని అయినా చేస్తాడు.ఒకవేళ నష్టం వస్తుంది, రిస్క్ ఉంది అని అనిపిస్తే మాత్రం అటు వైపు కన్నెత్తి కూడా చూడడు.
అలాంటిది తన రెండవ కొడుకు అభిరామ్ ని( Daggubati Abhiram ) హీరో గా పరిచయం చేస్తూ , లేటెస్ట్ గానే ‘అహింస’( Ahimsa ) అనే సినిమాని విడుదల చేసాడు.ఈ సినిమాకి తేజ దర్శకత్వం వహించాడు.
టీజర్ మరియు ట్రైలర్ తోనే నాసిరకం అనిపించిన ఈ సినిమా కి కనీస స్థాయి ఓపెనింగ్స్ కూడా దక్కలేదు.ఫలితంగా లీడర్ రేంజ్ సినిమాతో తన అన్నయ్య లాగానే, అభిరాం కూడా మంచి కంటెంట్ ఉన్న సినిమాతో ఇండస్ట్రీ లోకి అడుగుపెడతాడు అనుకుంటే, కనీసం గ్రాస్ వసూళ్లను రాబట్టలేకపోయింది.
ఈ సినిమాకి సురేష్ బాబు దాదాపుగా 15 కోట్ల రూపాయిలు బడ్జెట్ ని ఖర్చు చేసాడట.తాని చేసే సినిమాలకు 5 కోట్ల బడ్జెట్ కి మించి ఖర్చు చెయ్యని సురేష్ బాబు ఏకంగా 15 కోట్లు ఈ సినిమాకి ఖర్చు చేసాడు.కనీసం కోటి రూపాయిల గ్రాస్ వసూళ్లు కూడా రాకపోవడం తో ఈ చిత్రానికి పెట్టిన డబ్బులు మొత్తం పోయాయట.అందుకే కొంతకాలం వరకు సినిమాలకు దూరం ఉండడమే మంచిది అని ఆయన సినిమాలకు దూరం అవ్వబోతున్నట్టు ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తున్న వార్త.