దివ్యాoగ క్రికెట్ క్రీడా ఐపీఎల్( IPL ) విభాగంలో ఖమ్మం జిల్లా( Khammam district )కు చెందిన ముగ్గురు క్రీడాకారులు ఎంపికయ్యారు .ఈనెల 11 వ తేదిన ఢిల్లీలోని ద్వారక ప్రాంతంలో జరగనున్న పోటీలలో హైదరాబాద్ హరికేల్ జట్టు తరుపున ఖమ్మం జిల్లా కేంద్రానికి చెందిన దివ్యంగా సీనియర్ క్రీడాకారులు సమియుద్దీన్,జనక సురేష్, బండ్ల రాములు ఎంపికై ఆడనున్నారు.
ఈనెల 11 వ తేదీన ఢిల్లీలో ఐపీఎల్ వీల్ చైర్ టోర్నీలో పాల్గొనే ముగ్గురు క్రీడాకారులకు ప్రముఖ చిన్న పిల్లల వైద్యులు డాక్టర్ కూరపాటి ప్రదీప్ ( Pradeep Kumar Kurapati )రవాణా ఖర్చుల నిమిత్తం క్రీడా స్ఫూర్తితో 10వేల నగదును అందజేసి క్రీడా స్ఫూర్తిని చాటుకున్నారు.దీంతో పలుక్రీడా సంఘాలు , ఇతర దివ్యాoగ సంఘాలు, పుర ప్రముఖులు, క్రికెట్ నెట్ ఇంఛార్జి కోచ్ మతీన్, సాంబమూర్తిలు హార్శం వ్యక్తం చేశారు.







