కుల, చేతి వృత్తుల పై ఆధారపడి జీవనం సాగిస్తున్న వారి అభివృద్ధికి తోడ్పాటు అందించాలనే లక్ష్యంతో వారికి రూ.లక్ష ఇవ్వాలని తలచి నేటి నుండి అమలు జరిపిన సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఅర్ చిత్రపటానికి రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ( Puvvada Ajay Kumar )కుమ్మర సంఘం అధ్వర్యంలో క్షీరభిషేకం చేశారు.
రాష్ట్ర అవతరణ శతాబ్ది ఉత్సవాల్లో భాగంగా ఖమ్మం నగరంలోని దరిపల్లి ఫంక్షన్ హాల్ నందు జరిగిన ఉత్సవాల్లో కేసీఅర్( CM KCR ) గారికి క్షీరాభిషేకం నిర్వహించారు.అనాదిగా తమ ఆత్మగౌరవానికి ప్రతీకలుగా ఉన్న వివిధ కుల వృత్తులను తెలంగాణ ప్రభుత్వం ప్రోత్సహించడమే కాకుండా నేడు రూ.లక్ష మంజూరు చేయడం పట్ల వారు హర్షం వ్యక్తం చేశారు.
కుల వృత్తులనే జీవనాధారం చేసుకుని జీవిస్తున్న లక్షలాది మంది కుటుంబాలు సిఎం కేసీఅర్ కి, తెలంగాణ ప్రభుత్వం( Telangana Govt )కు ఆజన్మంతం రుణ పడి ఉంటామని అన్నారు.
కార్యక్రమంలో కుమ్మర సంఘం రాష్ట్ర కార్యదర్శి దరిపల్లి శ్రీనివాస్, ఖమ్మం కార్పొరేషన్ సంఘం అధ్యక్షులు తొర్లికోండ నర్సింహారావు, ఎంబీసీ రాష్ట్ర కో-కన్వీనర్ షేక్ షకీన, వృత్తి దారుల సంఘం కన్వీనర్ ఇజ్జగిరి బాబు, మేయర్ పునుకొల్లు నీరజ, డిప్యూటీ మేయర్ ఫాతిమా జోహార, BRS నగర అధ్యక్షుడు పగడాల నాగరాజు తదితరులు ఉన్నారు.







