సూపర్ స్టార్ మహేష్( Mahesh Babu ) మల్టీస్టారర్స్ కి ఎప్పుడూ రెడీ అనే అంటాడు.ఆల్రెడీ ఆయన కెరీర్ లో కృష్ణ గారితో కలిసి మల్టీస్టారర్( Multistarrer ) సినిమా చేశారు.
అయితే స్టార్డం వచ్చాక ఫుల్ లెంగ్త్ సినిమా చేయాలని అనుకున్నా అది కుదరలేదు.ఇదిలాఉంటే వెంకటేష్ తో మహేష్ సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు( Sitamma Vakitlo Sirimalle Chettu ) సినిమా చేశాడు.
ఆ సినిమా సూపర్ హిట్ అయ్యింది.అయితే ఆమధ్య ఒక ఇంటర్వ్యూలో కూడా తను కూడా మల్టీస్టారర్ సినిమాలు చేసేందుకు సిద్ధమే కానీ కథ బాగుండాలని అంటున్నాడట మహేష్.
తనతో నటించే హీరో కూడా తనలా సమఉజ్జీ అయ్యి ఉండాలని.అతని పాత్ర తన పాత్ర పోటాపోటీగా ఉండాలని అన్నాడట.అలా మంచి కథ ఉంటే తప్పకుండా మల్టీస్టారర్ రెడీ అంటున్నాడట.మహేష్ ఈ మాట ఇప్పుడే కాదు అప్పుడు కూడా చెప్పాడు.టాలీవుడ్ లో ఒకప్పుడు మల్టీస్టారర్ సినిమాలు వచ్చాయి కానీ ఇప్పుడు అవి పూర్తిగా తగ్గిపోయాయి.మహేష్ మాత్రం తానెప్పుడైనా మల్టీస్టారర్స్ కి రెడీ అంటూ అనౌన్స్ చేస్తున్నాడు.
ప్రస్తుతం మహేష్ త్రివిక్రం డైరెక్షన్ లో గుంటూరు కారం సినిమా చేస్తున్నాడు.ఈ సినిమా 2024 సంక్రాంతికి రిలీజ్ ప్లాన్ చేశారు.