టాలీవుడ్ పాన్ ఇండియా స్టార్ ప్రభాస్( Prabhas ) ప్రస్తుతం వరుసగా సినిమాలలో నటిస్తూ దూసుకుపోతున్న విషయం తెలిసిందే.వరుసగా పాన్ ఇండియా సినిమాలలో నటిస్తూ దూసుకుపోతున్నారు.
ఈ క్రమంలోనే ప్రభాస్ తాజాగా నటించిన చిత్రం ఆదిపురుష్.( Adipurush ) ఓం రౌత్ దర్శకత్వం వహించిన ఈ సినిమా జూన్ 16న గ్రాండ్గా ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.
ఇందులో ప్రభాస్ సరసన కృతి సనన్ హీరోయిన్ గా నటించిన విషయం తెలిసిందే.ఈ సినిమా నుంచి విడుదలవుతున్న ఒక్కొక్క అప్డేట్ ఈ సినిమాపై అంచనాలను మరింత పెంచేస్తున్నాయి.
ఇది ఇలా ఉంటే తాజాగా ప్రభాస్ కి సంబంధించి ఒక ఆసక్తికర వార్త చెక్కర్లు కొడుతోంది.అదేమిటంటే ఆదిపురుష్ కంటే ముందు ప్రభాస్ ఒక సినిమాలో పౌరాణిక పాత్రలో నటించారట.
ప్రభాస్ వాళ్ల కుటుంబంలో వాళ్ల పెదనాన్న కృష్ణంరాజు తెలుగు అగ్ర కథానాయకుల్లో ఒకరిగా రాణించిన విషయం తెలిసిందే.తండ్రి సూర్య నారాయణ రాజు నిర్మాత.ఇంట్లో ఎపుడు సినిమా వాతావరణమే.అయినా కలలో కూడా సినిమా హీరో అవుదామని అనుకోలేదట ప్రభాస్.
పెద్దయ్యాక ఏదో ఒక వ్యాపారం చేద్దాం అని అనుకున్నాడట.కానీ స్నేహితులు మాత్రం ఎపుడు ప్రభాస్‌ను సరదాగా హీరో అని పిలుచేవాళ్లట.
ఇక చదువు పూర్తి అవ్వగానే ప్రభాస్‌కు సడెన్‌గా హీరో అవ్వాలనిపించట.

ఆ విషయం ఇంట్లో చెబితే పెదనాన్నతో పాటు అందరూ ఆశ్చర్యం వ్యక్తం చేసారట.యాక్ట్ చేయాలని ఉంటే యాక్టింగ్‌లో శిక్షణ తీసుకోమని చెప్పి విశాఖలోని సత్యానంద్ దగ్గర పంపారట.ఇక నటనలో శిక్షణ తీసుకుంటున్న సమయంలో ప్రముఖ నిర్మాత రామానాయుడు మేనల్లుడు అశోక్ కుమార్ సినిమా చేద్దామని అన్నారట.
ముందు ఓకే చేయలేదు.ఆ తర్వాత పెదనాన్న కృష్ణంరాజు జోక్యం చేసుకొని సినిమా చేయమని చెప్పడంతో జయంత్ సి.పరాన్జీ దర్శకత్వంలో ఈశ్వర్ సినిమాలో నటించారు ప్రభాస్.తర్వాత ఎన్టీఆర్ హీరోగా రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన యమ దొంగ సినిమాను విశ్వామిత్రా క్రియేషన్ బ్యానర్‌లో తెరకెక్కించారు.

ఈ సినిమా కోసం ప్రత్యేకంగా ఏమైనా చేద్దామనుకున్నారు రాజమౌళి.అలా టైటిల్స్ పడే సమయంలో ప్రభాస్ విశ్వామిత్రుడిగా కనిపించారు.నేనేంటి విశ్వామిత్రుడి వేషం ఏంటీ అనుకున్నాడట ప్రభాస్.కానీ రాజమౌళి కన్విన్స్ చేయడంతో విశ్వామిత్రుడి వేషం వేసినట్టు చెప్పుకొచ్చారు.అంటే ఆదిపురుష్ సినిమా కంటే ముందు యమదొంగ సినిమాలో కేవలం ఒకే ఒక్క సన్నివేశం కోసము అది కూడా టైటిల్స్ కార్డ్స్‌లో విశ్వామిత్రా క్రియేషన్స్ బ్యానర్ వచ్చేటపుడు ప్రభాస్ విశ్వామిత్రుడి వేషంలో కనిపించి అలరించారు.